సిద్దార్థ్‌ను పట్టించుకోకండి.. టైమ్‌ పాస్ కోసం ఆరోపణలు చేస్తారు: బీజేపీ

  • IndiaGlitz, [Saturday,May 01 2021]

కేంద్ర ప్రభుత్వంపై హీరో సిద్ధార్థ్‌ చేసే ఆరోపణలు, విమర్శలను ఎవ్వరూ పట్టించుకోవద్దని బీజేపీ నేతలు తమ కార్యకర్తలకు వెల్లడించారు. తమిళనాడు భాజపా నేతలు తన ఫోన్‌ నంబర్‌ని లీక్‌ చేశారని.. దానివల్ల ఎంతోమంది నుంచి తనకు బెదిరింపులు ఎక్కువయ్యానని సిద్ధార్థ్‌ ఇటీవల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. హీరో ఆరోపణలను తాజాగా పలువురు బీజేపీ నేతలు ఖండించారు. ఆయన ఎన్నోసార్లు బీజేపీ ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలే గుప్పించారని వారు మండిపడ్డారు.

బీజేపీ వాళ్లు అత్యాచారం, హత్య చేస్తామంటూ బెదిరిస్తున్నారు: సిద్దార్థ్

తాజాగా ఐటీ సెల్‌ విభాగాధిపతి నిర్మల్‌ కుమార్‌ స్పందిస్తూ.. ప్రస్తుతం ఉన్న క్లిష్టపరిస్థితుల్లో ప్రజలకు అవసరమైన ఆహారాన్ని, మందులను పంపిణీ చేయడంలో తాము ఎంతో నిమగ్నమై ఉన్నామన్నారు. హీరో సిద్ధార్థ్‌తోపాటు ఆయన లాగా విమర్శలు చేసే వ్యక్తుల గురించి మీరు పట్టించుకోవద్దని బీజేపీ మద్దతుదారులందరులకు ఆయన తెలిపారు. వాళ్లు కేవలం టైమ్‌పాస్‌ చేయడం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తారన్నారు. ప్రజలకు సాయం చేయడంపైనే మీ దృష్టి ఉంచాలని నిర్మల్ కుమార్ ట్వీట్‌‌లో పేర్కొన్నారు.

కాగా.. ఇటీవల సిద్దార్థ్ ట్విటర్‌లో ‘‘తమిళనాడు భాజపాకు చెందిన కొంతమంది నా ఫోన్‌ నంబర్‌ని లీక్‌ చేశారు. సుమారు 500 ఫోన్‌కాల్స్‌.. అందరూ నన్ను తిడుతున్నారు. నన్ను, నా కుటుంబసభ్యులను అత్యాచారం, హత్య చేస్తామంటూ గడిచిన 24 గంటల నుంచి నన్ను బెదిరిస్తున్నారు. ఆ ఫోన్‌ నంబర్లు, వాళ్లు మాట్లాడిన రికార్డింగ్స్ అన్నింటినీ భద్రపరిచా(బీజేపీ లింక్స్, డీపీలతో). వాటిని పోలీసులకు అందిస్తున్నా. నేను ఏమాత్రం తగ్గేదే లేదు. కావాలంటే ట్రై చేసుకోండి’’ అని తెలిపాడు. దీనిపైనే నిర్మల్ కుమార్ తాజాగా స్పందించారు.

More News

ఈటల భూ కబ్జా వాస్తవమే.. 3 గంటల్లో నివేదిక: కలెక్టర్ హరీష్

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌పై భూ వివాదానికి సంబంధించిన ఆరోపణలు ఒక్కసారిగా వెల్లువెత్తిన ఘటన శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.

కరోనా రోగుల కోసం అంబులెన్స్ డ్రైవర్‌‌గా మారిన కన్నడ హీరో

ప్రముఖ నటుడు సోనూసూద్ బాటలోనే మరో హీరో కూడా కరోనా రోగులకు సేవలందిస్తున్నాడు.

ఒక్క సిగిరెట్ కారణంగా 18 మందికి కరోనా..

ఒక మహిళ అష్టాచెమ్మా ఆడి పదుల సంఖ్యలో కరోనా అంటించిన విషయం ఇప్పటికీ తెలంగాణ వాసులు మరువలేరు.

నటుడు బిక్రమ్‌జీత్ కన్వర్ పాల్ కరోనాతో మృతి

యావత్ భారతదేశాన్ని కరోనా మహమ్మారి భయబ్రాంతులకు గురి చేస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోందే కానీ తగ్గుతున్న దాఖలాలైతే కనిపించడం లేదు.

దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు.. నిన్న ఒక్కరోజే ఎన్నంటే..

యావత్ భారతదేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోందే కానీ తగ్గుతున్న దాఖలాలైతే కనిపించడం లేదు.