సిద్దార్థ్‌ను పట్టించుకోకండి.. టైమ్ పాస్ కోసం ఆరోపణలు చేస్తారు: బీజేపీ
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర ప్రభుత్వంపై హీరో సిద్ధార్థ్ చేసే ఆరోపణలు, విమర్శలను ఎవ్వరూ పట్టించుకోవద్దని బీజేపీ నేతలు తమ కార్యకర్తలకు వెల్లడించారు. తమిళనాడు భాజపా నేతలు తన ఫోన్ నంబర్‌ని లీక్ చేశారని.. దానివల్ల ఎంతోమంది నుంచి తనకు బెదిరింపులు ఎక్కువయ్యానని సిద్ధార్థ్ ఇటీవల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. హీరో ఆరోపణలను తాజాగా పలువురు బీజేపీ నేతలు ఖండించారు. ఆయన ఎన్నోసార్లు బీజేపీ ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలే గుప్పించారని వారు మండిపడ్డారు.
బీజేపీ వాళ్లు అత్యాచారం, హత్య చేస్తామంటూ బెదిరిస్తున్నారు: సిద్దార్థ్
తాజాగా ఐటీ సెల్ విభాగాధిపతి నిర్మల్ కుమార్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఉన్న క్లిష్టపరిస్థితుల్లో ప్రజలకు అవసరమైన ఆహారాన్ని, మందులను పంపిణీ చేయడంలో తాము ఎంతో నిమగ్నమై ఉన్నామన్నారు. హీరో సిద్ధార్థ్‌తోపాటు ఆయన లాగా విమర్శలు చేసే వ్యక్తుల గురించి మీరు పట్టించుకోవద్దని బీజేపీ మద్దతుదారులందరులకు ఆయన తెలిపారు. వాళ్లు కేవలం టైమ్‌పాస్ చేయడం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తారన్నారు. ప్రజలకు సాయం చేయడంపైనే మీ దృష్టి ఉంచాలని నిర్మల్ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా.. ఇటీవల సిద్దార్థ్ ట్విటర్‌లో ‘‘తమిళనాడు భాజపాకు చెందిన కొంతమంది నా ఫోన్ నంబర్‌ని లీక్ చేశారు. సుమారు 500 ఫోన్‌కాల్స్.. అందరూ నన్ను తిడుతున్నారు. నన్ను, నా కుటుంబసభ్యులను అత్యాచారం, హత్య చేస్తామంటూ గడిచిన 24 గంటల నుంచి నన్ను బెదిరిస్తున్నారు. ఆ ఫోన్ నంబర్లు, వాళ్లు మాట్లాడిన రికార్డింగ్స్ అన్నింటినీ భద్రపరిచా(బీజేపీ లింక్స్, డీపీలతో). వాటిని పోలీసులకు అందిస్తున్నా. నేను ఏమాత్రం తగ్గేదే లేదు. కావాలంటే ట్రై చేసుకోండి’’ అని తెలిపాడు. దీనిపైనే నిర్మల్ కుమార్ తాజాగా స్పందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com