విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రానికి త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు

  • IndiaGlitz, [Saturday,March 31 2018]

‘పెళ్లిచూపులు’, అర్జున్ రెడ్డి’ చిత్రాల విజ‌యాల‌తో యూత్ స్టార్ విజయ్ దేవరకొండ చేతినిండా సినిమాలతో బిజీగా మారిపోయారు. ఇప్పటికే ‘మహానటి’, ‘టాక్సీవాలా’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. బైలింగ్వల్ (తెలుగు, తమిళం) ఫిలిమ్ ‘నోటా’ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు విజయ్. ఈ చిత్రాన్ని ‘పెళ్లిచూపులు’ నిర్మాత యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మరో తమిళ సంగీత దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయం కానున్నారు.

ఆ వివరాల్లోకి వెళితే.. గతంలో భరత్ కమ్మ ‘మరో ప్రపంచం’ అనే షార్ట్ ఫిలింను రూపొందించారు. ఆ షార్ట్ ఫిలింకు సంగీతం అందించారు జస్టిన్ ప్రభాకరన్. అప్పుడు వీరిమధ్య ఏర్పడిన స్నేహబంధంతో.. ఇప్పుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న చిత్రానికి సంగీత దర్శకత్వం బాధ్యతలు చేపట్టనున్నారు ప్రభాకరన్. ‘పన్నాయురం పద్మినియుం’, ‘ఆరెంజ్ మిఠాయ్‌’, ‘ఒరు నాల్ కూత్తు’ తో పాటు తాజాగా విడుదలైన ‘ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్’ సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు. మ‌రి టాలీవుడ్‌లో అనిరుధ్‌ రవిచంద్రన్, హిప్ హాప్ తమిళ వంటి త‌మిళ సంగీత ద‌ర్శ‌కుల‌ మాదిరిగా ప్రభాకరన్ కూడా తనదైన ముద్ర వేస్తారేమో చూడాలి.

More News

'2 స్టేట్స్‌' లో మిస్ విజ‌య‌వాడ‌

ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం '2 స్టేట్స్‌'.

మ‌ల్టీస్టార‌ర్ కోసం మూడు నిర్మాణ సంస్థ‌లు...

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ సంస్కృతి ఎక్కువ అవుతుంది. అందులో భాగంగా విక్ట‌రీ వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌నుంది.

ఆరో స్థానంలో 'రంగ‌స్థ‌లం'

1985 కాలం నాటి ప‌రిస్థితుల‌తో.. గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రంగా 'రంగస్థలం' చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సుకుమార్.

చ‌ర‌ణ్ ఎంట్రీ డేట్ ఫిక్స‌య్యింది...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

'మ‌ణిక‌ర్ణిక' షూటింగ్ పూర్తి

భిన్నమైన కథలతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్. ప్రస్తుతం వీరనారి ఝాన్సీ లక్ష్మిబాయి జీవితం ఆధారంగా 'మణికర్ణిక' సినిమాని తెరకెక్కిస్తున్నారు.