పూరి సినిమాతో తమిళ్ సినిమా

  • IndiaGlitz, [Saturday,December 22 2018]

తమిళంలో ఘనవిజయం సాధించిన ‘చతురంగ వేట్టై’ని ఆధారంగా రూపొందిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. సత్యదేవ్, నందితాశ్వేత హీరో హీరోయిన్‌గా నటించారు. గోపీ గణేష్ పట్టాబి దర్శకుడు. రమేశ్ పిళ్లై నిర్మాత. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రానికి సమ‌ర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోపీ గణేష్ పట్టాబి మీడియాతో మాట్లాడుతూ ‘‘‘బ్లఫ్ మాస్టర్’ తమిళ కథకు ఇన్‌స్పిరేషన్ మా గురువుగారు తీసిన ‘బిజినెస్‌మేన్’ సినిమా. ఆ సినిమాలో హీరో బ్యాంక్ ఓపెన్ చేసినప్పుడు హీరోకి, కమీషనర్‌కు మధ్య ఓ చిన్న డిస్కషన్ నడుస్తుంది. దాని ఆధారంగానే సోసైటీలోని మరో కోణంలో కథను తయారు చేసుకున్నారు తమిళ దర్శకుడు వినోద్. సత్యదేవ్ కంటే ముందు నలుగురైదుగురు హీరోలు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చి వెళ్లారు. హీరో క్యారెక్టరైజేషన్‌ను మార్చుకుని రాసుకున్నాను. డైలాగ్స్ నేనే రాసుకున్నాను. అడిషనల్ డైలాగ్స్ సపోర్టింగ్‌ను కీలక సన్నివేశాలను పులగం చిన్నారాయణగారు అందించారు. ఇన్‌డైరెక్ట్‌గా, సెటైరికల్‌గా మంచి మెసేజ్‌ను చెప్పేంత స్కోప్ ఉన్న సినిమా ఇది. మంచి సినిమా. థియేటర్‌కొచ్చే ప్రేక్షకుడ్ని మా సినిమా బ్లఫ్ చేయదు. ఇప్పుడు కె.ఎస్.రామారావుగారితో చేయాల్సిన సినిమా పైప్‌లైన్‌లో ఉంది’’ అన్నారు.

More News

ఆ పుకారు ఎవ‌రో పుట్టించారో తెలియ‌దంటున్న సాయిప‌ల్ల‌వి

శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. హను రాఘవపూడి దర్శకుడు. చెరుకూరి సుధాకర్ నిర్మాత. డిసెంబర్ 21న సినిమా విడుదలైంది.

వేలంటైన్స్ డే కానుక‌గా 'ల‌వ‌ర్స్ డే'

అమ్మాయి ఓర‌చూపు చూస్తే వ‌ల‌లో ప‌డ‌ని అబ్బాయిలు ఉండ‌ర‌ని అంటారు. మ‌ల‌యాళ బ్యూటీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ విష‌యంలో అది మ‌రోసారి రుజువైంది.

గోపీచంద్ కొత్త చిత్రం ప్రారంభం

యాక్ష‌న్ హీరో గోపీచంద్, త‌మిళ్ ద‌ర్శ‌కుడు తిరు కాంబినేష‌న్‌లో.. ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిర్మిస్తున్న సినిమా ఓపెనింగ్ డిసెంబ‌ర్ 22న అనిల్ సుంక‌ర ఆఫీసులో జ‌రిగింది.

విజ‌య్ ఆంటోని 'జ్వాల‌' ప్రారంభం

అమ్మా క్రియేష‌న్స్ ప‌తాకంపై విజ‌య్ ఆంటోని, అరుణ్ విజ‌య్‌, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం జ్వాల శుక్ర‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. విజ‌య్ ఆంటోని తెలుగులో న‌టిస్తున్న స్ట్ర‌యిట్ మూవీ ఇది.

బాల‌య్య క‌న్‌ఫ‌ర్మ్ చేశాడు

నందమూరి బాల‌కృష్ణ త‌దుప‌రి చిత్రంపై ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై బాల‌కృష్ణ నిన్న ఓ క్లారిటీ ఇచ్చేశారు. `య‌న్‌.టి.ఆర్` చిత్రం `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు`