ఫేషియల్‌కని వెళ్లిన నటిని అందవిహీనంగా మార్చేసిన డాక్టర్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆడవాళ్లు అందానికి ఎంత ప్రాధాన్యమిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక నటీమణులైతే.. చాలా ప్రాధాన్యం ఇస్తారు. తమ అందాన్ని కాపాడుకునేందుకు వాళ్లు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. దీనికోసం తీసుకునే ఫుడ్ విషయంలోనూ జాగ్రత్త వహిస్తారు. అలాగే.. ఫేషియల్స్ అని, సర్జరీలతో పేరుతో తమ అందాన్ని మెరుగుపరుచుకునేందుకు నిత్యం ఆరాటపడుతూనే ఉంటారు. అయితే ఈ అందాన్ని కాపాడుకోవాలనే తపన ఓ నటికి ఊహించని కష్టాన్ని తెచ్చి పెట్టింది. ఫేషియల్ కోసమని ఓ డాక్టర్ వద్దకు వెళితే.. ఆమె కాస్తా ముఖాన్ని అందంగా మార్చడం అటుంచి అందవిహీనంగా మార్చేసింది.
తమిళ నటి రైజా విల్‌సన్‌కు ఈ అనూహ్య సంఘటన ఎదురైంది. సాధారణ ఫేషియల్ కోసమని రైజా విల్‌సన్ ఇటీవల ఓ క్లినిక్‌కు వెళ్లింది. అక్కడి మహిళా డాక్టర్ చర్మానికి మరింత నిగారింపు తీసుకొస్తానంటూ బలవంతంగా ఆమెకు చర్మ చికిత్స చేసింది. అది కాస్తా వికటించింది. దీంతో నటి కన్ను కింద వాచిపోయింది. అది ఉబ్బిపోయి అందం మాట అటుంచితే అందవిహీనంగా మార్చేసింది. విషయం కనుక్కుందామని వెళితే అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు సరికదా.. అసలు తను ఊళ్లోనే లేనని సిబ్బందితో చెప్పిస్తోంది. దీంతో ఆ వైద్యురాలు తనకు చేసిన నిర్వాకాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.
"నాకు అవసరం లేకపోయినా డాక్టర్ భైరవి నాకేదో చేయాలని ట్రై చేసింది. చివరికి ఫలితం ఇదిగో ఇలా వచ్చింది.. దీని గురించి నిలదీద్దాం అంటే ఆమె నాతో మాట్లాడటానికి, కలవడానికి కూడా నిరాకరిస్తోంది. సిబ్బందిని అడిగితే ఆమె అసలు నగరంలోనే లేదని జవాబిస్తున్నారు" అంటూ ఓ ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో యాడ్ చేసింది. 'డా.భైరవి తన దగ్గరకు వచ్చే కస్టమర్లపై వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా ప్రయోగాలు చేస్తుంది' అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లలో వాపోయారు. దీంతో తనలాంటి బాధితులు చాలామంది ఉన్నారని తెలిసి రైజా విల్సన్ షాకైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com