విలన్ పాత్రలో తమిళ హీరో

  • IndiaGlitz, [Thursday,March 01 2018]

క‌న్న‌డం, తెలుగులో విడుద‌ల‌వుతున్న చిత్రం 'రాజార‌థం'. ఈ చిత్రంతో హీరో, హీరోయిన్లుగా నిరూప్‌ భండారి, అవంతిక షెట్టి తెలుగు తెరకు పరిచయం అవనున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో తమిళ స్టార్‌ హీరో ఆర్య, పి.రవిశంకర్‌ కనిపిస్తారు. ఇప్పుడు దర్శకుడు అనూప్‌ భండారి ఈ చిత్రానికి కథ, పాటలు, సంగీతం అందించటం తో పాటు కొన్ని పాటలు కూడా పాడటం విశేషం.

నిరూప్‌ భండారి హీరోగా అనూప్‌ భండారి దర్శకత్వం వహించిన 'రంగి తరంగ' చిత్రాన్ని యు.ఎస్‌, యూరప్‌ దేశాలలో పంపిణీ చేసిన 'జాలీ హిట్స్‌' సంస్థ తమ తొలి ప్రయత్నంగా 'రాజారథం' చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది.ఈ చిత్రంలో త‌మిళ హీరో ఆర్య విల‌న్‌గా న‌టిస్తున్నాడు. గ‌తంలో తెలుగు వరుడు చిత్రంలో ఆర్య విల‌న్‌గా న‌టించి ఆక‌ట్టుకున్నాడు.