కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలుకు కరోనా .. ఆస్పత్రిలో చికిత్స
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో కరోనా వైరస్ ఎంతోమంది ప్రముఖులను బలి తీసుకుంది. వీరిలో పలువురు సినీతారలు కూడా వున్నారు. దేశంలో కోవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్ సమయాల్లో సినీనటులు, టెక్నీషియన్లు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు చావు అంచులదాకా వెళ్లొచ్చారు. అయితే ఇటీవల ఒమిక్రాన్ వెలుగులోకి వస్తున్న నాటి నుంచి మళ్లీ సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, అమృతా అరోరా సహా పలువురు కోవిడ్ బారినపడ్డారు.
ఇటు తమిళ చిత్ర సీమలో కూడా పలువురు కోవిడ్ బారినపడ్డారు. ఇటీవల విలక్షణ నటుడు కమల్ హాసన్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. పరీక్షలు చేయించగా కరోనాగా తేలింది. ఆ తర్వాత ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుని , కోలుకున్నారు. అనంతరం మరో విలక్షణ నటుడు విక్రమ్ కూడా కరోనా బారినపడ్డారు.
తాజాగా కోలీవుడ్‌లోనే మరో సినీ ప్రముఖుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయన ఎవరో కాదు.. స్టార్ కమెడియన్ వడివేలు. మూడు రోజుల క్రితం యూకే నుంచి తిరిగొచ్చిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు పోరూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. అయితే ప్రస్తుతం బ్రిటన్‌లో ఒమిక్రాన్ తీవ్రత అధికంగా వున్న నేపథ్యంలో ఆయనకు సోకింది ఒమిక్రానా లేక డెల్టా రకమా అన్నది నిర్ధారించేందుకు వడివేలు శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. శనివారం ఫలితాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ఒకప్పుడు స్టార్ కమెడియన్‌గా తమిళ పరిశ్రమను ఏలిన వడివేలు మధ్యలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, స్టార్ డైరెక్టర్లు, నటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన సినిమా కెరీర్ కు బ్రేకులు పడ్డాయి. అయితే ఈ ఏడాదే మళ్లీ ముఖానికి మేకప్ వేసుకునేందుకు వడివేలు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే ‘నాయి శేఖర్ రిటర్న్’ సినిమా కోసం ఆయన లండన్ కు వెళ్లారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com