రామ్‌చ‌ర‌ణ్ బాబాయి పాత్ర‌లో త‌మిళ న‌టుడు....

  • IndiaGlitz, [Saturday,December 15 2018]

మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ ఆఫ్ టాలీవుడ్‌గా రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న 'ఆర్ ఆర్ ఆర్‌' పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే గండిపేట‌లో వేసిన భారీ సెట్లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసేశారు. త్వ‌ర‌లోనే మ‌రో షెడ్యూల్ ప్రారంభం కానుంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రముస్లిం యువ‌కుడిగా క‌న‌ప‌డబోతున్నాడ‌ట‌. అందుకోసం లుక్ అంతా డిఫ‌రెంట్‌గాఉండేలా ప్లాన్ చేస్తున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది.

అదేంటంటే ఈ చిత్రంలో మెగావ‌ప‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ బాబాయి పాత్ర‌లో త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని న‌టిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఆయ‌న షూట్‌లో పాల్గొన‌బోతున్నార‌ని టాక్‌. 2020లో విడుద‌ల కాబోయే ఈ చిత్రాన్ని మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నాడు నిర్మాత డి.వి.వి.దాన‌య్య‌.