ఇప్పుడు త‌మ‌న్నా కూడా అత‌నితో

  • IndiaGlitz, [Tuesday,December 15 2015]

త‌మిళంలో విల‌క్ష‌ణ పాత్ర‌ల‌కు పెట్టింది పేరు విజ‌య్ సేతుప‌తి, ప్ర‌తి క్యారెక్ట‌ర్‌లో ఏదో ఒక డిఫ‌రెన్స్‌ను చూపించాల‌నుకునే ఈ యంగ్ హీరోతో ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కూడా జ‌త క‌ట్ట‌డానికి రెడీ అవుతున్నారు. రీసెంట్‌గా నానుం రౌడీ తాన్ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది.

అంతే కాకుండా శృతిహాస‌న్ కూడా విజ‌య్ సేతుప‌తితో న‌టిస్తుందని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇప్పుడు మ‌ర స్టార్ హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా కూడా విజ‌య్ సేతుప‌తితో న‌టించ‌డానికి రెడీ అయింది. సినిమా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చేసింద‌ని త‌మిళ సినిమా వర్గాల విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.