సమంతకు తమన్నా షాక్...?
Send us your feedback to audioarticles@vaarta.com
100% లవ్, తఢాఖా చిత్రాలు తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి నాగచైతన్యతో కలిసి నటించనుంది. నాగచైతన్య, కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ముందు సమంతను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే సమంత సినిమాల్లో నటించకూడదనుకుందో మరేమో కానీ ఈ సినిమా నుండి డ్రాప్ అయ్యింది.
తాజాగా ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటించే అవకాశాలు కనపడుతున్నాయట. యూనిట్ తమన్నాను సంప్రదించారట. తమన్నా కూడా దాదాపు ఎక్కువగా ఒప్పుకునే అవకాశాలే కనపడుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం సాహసం శ్వాసగా, ప్రేమమ్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు తర్వాతే ఈ సినిమా సెట్స్‌లోకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. ఇక తమన్నా ఒప్పుకుంటే ఓ రకంగా సమంతకు షాకిచ్చినట్టేనని కూడా వార్తలు వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com