తమన్నా విషయంలో రిపీట్ అవుతుందా?

  • IndiaGlitz, [Tuesday,August 29 2017]

మొద‌ట ఓ హీరోయిన్‌ని ఎంచుకోవ‌డం.. ఆమెతో కొన్ని రోజులు షూటింగ్ చేయ‌డం.. ఆ త‌రువాత ఆమె స్థానంలోకి మ‌రో హీరోయిన్ రావ‌డం.. ఇలాంటివ‌న్ని సినిమా ప‌రిశ్ర‌మ‌లో స‌ర్వ‌సాధార‌ణ‌మే. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే క‌ళ్యాణ్ రామ్ కొత్త చిత్రం విష‌యంలో జ‌రిగింది. జ‌యేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం తొలుత ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మీ అనే కేర‌ళ‌కుట్టిని క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. అయితే ఆమె న‌ట‌న అంతగా మెప్పించ‌క‌పోవ‌డంతో.. కొద్ది రోజుల షూటింగ్ త‌రువాత ఆమెని తొల‌గించి ఆమె స్థానంలో త‌మ‌న్నాని ఎంచుకుంది చిత్ర బృందం.

విశేష‌మేమిటంటే.. ఊపిరి విష‌యంలోనూ త‌మ‌న్నా ఇలాగే శ్రుతి హాస‌న్ ని రీప్లేస్ చేసింది. ఆ సినిమా విష‌యంలోనూ శ్రుతి పై కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల శ్రుతి ఆ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంది. ఆ స్థానంలో త‌మ‌న్నా రావ‌డం.. సినిమా హిట్ కావ‌డం జ‌రిగింది. మ‌రి ఇదే సెంటిమెంట్ క‌ళ్యాణ్‌రామ్ కొత్త ప్రాజెక్ట్‌లోనూ త‌మ‌న్నాకి రిపీట్ అయి మ‌రో హిట్ దొరుకుతుందేమో చూడాలి.