తమన్నాకి ఏడాదికొకటి
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లో కొన్ని క్లబ్‌ల గురించి ప్రత్యేకంగా కథనాలు వినిపిస్తుంటాయి. అవే..రూ.50 కోట్ల వసూళ్ల క్లబ్స్, రూ.100 కోట్ల కలెక్షన్ల క్లబ్స్, యు.ఎస్.ఎలో వచ్చే 1 మిలియన్ డాలర్ల క్లబ్స్. ఈ మూడో క్లబ్‌కి చెందిన విషయంలో అందాల తార తమన్నా వరుసగా మూడో ఏడాది రికార్డ్‌ని సొంతం చేసుకోనుంది. ఆమె కొత్త చిత్రం 'ఊపిరి'తో అది ఆమె వశం కానుంది.
2014లో మహేష్‌తో తొలిసారిగా నటించిన 'ఆగడు'.. ఫలితంతో సంబంధం లేకుండా 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరింది. ఆ క్లబ్‌లో చేరిన తమన్నా మొదటి సినిమా ఇదే. ఇక 2015లో ప్రభాస్‌తో రెండోసారి ఆడిపాడిన 'బాహుబలి' కూడా ఇదే క్లబ్‌లో చేరింది. ఇంకా చెప్పాలంటే అందుకు 7 రెట్లు మిన్నగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఇదే వరుసలో 2016కిగానూ కార్తీతో మూడోసారి జతకట్టిన 'ఊపిరి' కూడా ఆ క్లబ్‌లో చేరేందుకు సిద్ధంగా ఉంది. అంటే.. ఏడాదికొక మిలియన్ డాలర్ క్లబ్ మూవీ తమన్నా ఖాతాలో చేరుతోందన్నమాట. వచ్చే ఏడాది ఈ జాబితాలోకి తమన్నా కొత్త చిత్రం 'బాహుబలి 2' అవలీలగా చేరుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com