త‌మ‌న్నా విష‌యంలో మ‌రోసారి

  • IndiaGlitz, [Saturday,March 26 2016]

త‌ను న‌టించే సినిమాల విష‌యంలో త‌మ‌న్నాకి ఓ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ఆమెకి చాలా సార్లు విజ‌యాల‌ను అందించింది. నిన్న విడుద‌లై స‌ర్వ‌త్రా మంచి టాక్ తెచ్చుకున్న 'ఊపిరి' విష‌యంలోనూ అది మ‌రోసారి రుజువైంది. ఇంత‌కీ అదేమిటంటే.. స‌మ్మ‌ర్ టైంలో రిలీజ‌య్యే త‌మ‌న్నా సినిమాలు హిట్ అవుతాయ‌న్న‌ది.

2009 నుంచి త‌మ‌న్నా హీరోయిన్‌గా వ‌చ్చిన తెలుగు, త‌మిళ అనువాదాల విష‌యంలో ఈ సంగ‌తిని గ‌మ‌నించ‌వ‌చ్చు. 2009లో త‌మిళ అనువాద చిత్రం 'వీడొక్క‌డే', 2010లో మ‌రో త‌మిళ డ‌బ్బింగ్ సినిమా 'ఆవారా', 2011లో వ‌చ్చిన తెలుగు చిత్రం '100% ల‌వ్‌', 2012లో 'ర‌చ్చ‌', 2013లో 'త‌డాఖా'.. ఇలా స‌మ్మ‌ర్‌లో త‌మ‌న్నా సినిమాలు హిట్ లిస్ట్ లో చేరాయి. ఇప్పుడు ఇదే బాట‌లో 2016లోనూ 'ఊపిరి'తో మ‌రో విజ‌యం వ‌రించింది. ఏదేమైనా త‌మ‌న్నాకి స‌మ్మ‌ర్ సెంటిమెంట్ బల‌ప‌డుతోంది. భ‌విష్య‌త్‌లోనూ ఆమెకి ఈ సెంటిమెంట్ కొన‌సాగుతుందేమో చూడాలి.

More News

పి.వి.పి కి హ్యాట్రిక్ ద‌క్కేనా..

ఇప్పుడు టాలీవుడ్ లో బాగా పాపుల‌ర్ అయిన పేరు పి.వి.పి. ర‌వితేజ హీరోగా బ‌లుపు చిత్రాన్ని నిర్మించి తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ సాధించారు పి.వి.పి. బ‌లుపు త‌ర్వాత త‌మిళ్ లో విశ్వ‌రూపం, తెలుగులో వ‌ర్ణ‌, సైజ్ జీరో చిత్రాల‌ను నిర్మించినా..స‌క్సెస్ మాత్రం సాధించ‌లేక‌పోయారు.

ప‌వన్ ఫ్యాన్స్ ని టెన్ష‌న్ పెడుతున్న సెంటిమెంట్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. శ‌ర‌త్ మ‌రార్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. బాబీ తెర‌కెక్కిస్తున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ప్ర‌స్తుతం స్విట్జ‌ర్లాండ్ లో రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.

ఊపిరి పై కొనసాగుతున్న స్టార్స్ ప్రశంసల వర్షం

టాలీవుడ్ కింగ్ నాగార్జున-కోలీవుడ్ హీరో కార్తీ-మిల్కీబ్యూటీ తమన్నా క్రేజీ కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ ఊపిరి.

ఆ వార్త‌లు జ‌స్ట్ రూమ‌ర్స్ అంటున్న వెంకీ..

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న తాజా చిత్రం బాబు బంగారం. ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కిస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'ఊపిరి' వంటి ఎక్స్ ట్రార్డినరీ ఫిలిమ్ తీసిన వంశీ పైడిపల్లికి అభినందనలు : సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్

మార్చి 25న విడుదలైన ఊపిరి సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఊపిరి సినిమాను చూసి అభినందిస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఊపిరి సినిమా వీక్షించారు.