తమన్నా విషయంలో మరోసారి
- IndiaGlitz, [Saturday,March 26 2016]
తను నటించే సినిమాల విషయంలో తమన్నాకి ఓ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ఆమెకి చాలా సార్లు విజయాలను అందించింది. నిన్న విడుదలై సర్వత్రా మంచి టాక్ తెచ్చుకున్న 'ఊపిరి' విషయంలోనూ అది మరోసారి రుజువైంది. ఇంతకీ అదేమిటంటే.. సమ్మర్ టైంలో రిలీజయ్యే తమన్నా సినిమాలు హిట్ అవుతాయన్నది.
2009 నుంచి తమన్నా హీరోయిన్గా వచ్చిన తెలుగు, తమిళ అనువాదాల విషయంలో ఈ సంగతిని గమనించవచ్చు. 2009లో తమిళ అనువాద చిత్రం 'వీడొక్కడే', 2010లో మరో తమిళ డబ్బింగ్ సినిమా 'ఆవారా', 2011లో వచ్చిన తెలుగు చిత్రం '100% లవ్', 2012లో 'రచ్చ', 2013లో 'తడాఖా'.. ఇలా సమ్మర్లో తమన్నా సినిమాలు హిట్ లిస్ట్ లో చేరాయి. ఇప్పుడు ఇదే బాటలో 2016లోనూ 'ఊపిరి'తో మరో విజయం వరించింది. ఏదేమైనా తమన్నాకి సమ్మర్ సెంటిమెంట్ బలపడుతోంది. భవిష్యత్‌లోనూ ఆమెకి ఈ సెంటిమెంట్ కొనసాగుతుందేమో చూడాలి.