తమన్నా కోరిక నెరవేరినట్టే
- IndiaGlitz, [Thursday,March 24 2016]
పేరుకి ఉత్తరాది భామ అయినా.. దక్షిణాది భాషలు తెలుగు, తమిళంను సైతం అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం హీరోయిన్ తమన్నా సొంతం. అయితే అంత బాగా మాట్లాడుతున్నప్పటికీ.. ఇప్పటివరకు ఈ రెండు భాషల్లోనూ డబ్బింగ్ చెప్పుకోలేకపోయింది తమన్నా. అయితే ఆ లోటు ఈ సంవత్సరం తీరబోతున్నట్లే.
తెలుగు, తమిళ భాషల్లో నాగార్జున, కార్తీలతో కలిసి తమన్నా నటించిన 'ఊపిరి' (తమిళంలో తోళా) చిత్రం కోసం.. తెలుగు వెర్షన్ కోసం తన గొంతు వినిపించే ప్రయత్నం చేసింది తమన్నా. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి మాత్రం అరువు గొంతుపై ఆధారపడకతప్పలేదు ఆమెకి. అయితే మరో తమిళ చిత్రం కోసం మాత్రం తమన్నా గొంతుని సవరించుకుంటోంది.
'ధర్మదురై' పేరుతో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న చిత్రం కోసం తమన్నా మధురై యాసతో కూడిన తమిళ్‌ని తన సొంత గొంతులో వినిపించబోతోంది. మొత్తమ్మీద 2016 సంవత్సరంలో.. తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్ చెప్పుకోవాలన్న తమన్నా కోరిక నెరవేరుతున్నట్లయ్యింది.