హ్యాట్రిక్ లే హ్యాట్రిక్‌లు
Send us your feedback to audioarticles@vaarta.com
జనరల్‌గా ఒక సినిమాకి ఒకటో రెండో హ్యాట్రిక్‌లు ముడిపడి ఉంటాయి. అయితే నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించగా ఈ శుక్రవారం విడుదలైన ద్విభాషా చిత్రం 'ఊపిరి' మాత్రం ఏకంగా ఐదు హ్యాట్రిక్లను సొంతం చేసుకుంది. అదెలా గంటే.. మనం, సోగ్గాడే చిన్ని నాయనా వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల తరువాత ఊపిరి నాగ్‌కి మూడో విజయాన్ని అందిస్తే.. తమన్నాకి బాహుబలి, బెంగాల్ టైగర్ చిత్రాల తరువాత ఊపిరి రూపంలో హీరోయిన్గా ముచ్చటగా మూడో విజయం దక్కింది.
ఇక దర్శకుడు వంశీ పైడిపల్లికి బృందావనం, ఎవడు చిత్రాల తరువాత హ్యాట్రిక్ విజయంగా ఊపిరి చేరింది. ఇక తమిళ వెర్షన్ 'తోళా' కోణంలో చూస్తే.. మెడ్రాస్, కొంబన్ వంటి విజయాల తరువాత తోళాతో కార్తీకి హ్యాట్రిక్ దక్కింది. అలాగే పయ్యా (ఆవారా), సిరుత్తై (విక్రమార్కుడు రీమేక్) చిత్రాల తరువాత కార్తీ, తమన్నా జంటకి తోళా రూపంలో మూడో విజయం దక్కింది. మొత్తమ్మీద ఓ సబ్జెక్ట్‌తో ఐదు హ్యాట్రిక్‌లు కొట్టడమంటే విశేషమే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com