తమిళ్ లో తమన్నా, మరి..తెలుగులో..?
Saturday, November 26, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ లో విజయం సాధించిన క్వీన్ చిత్రాన్ని సౌత్ లో రీమేక్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మూవీ సౌత్ ఇండియా రైట్స్ ను త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ వెర్షెన్ లో తమన్నా, మలయాళం వెర్షెన్ లో అమలాపాల్ నటిస్తున్నారు.
తమిళ, మలయాళ చిత్రాలకు రేవతి దర్శకత్వం వహిస్తారు. కన్నడలో పరుల్ యాదవ్ హీరోయిన్‌గా ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుంది. తెలుగులో అనీష్ కురువిళ్ల దర్శకత్వం వహిస్తారు. తెలుగుకు సంబంధించి ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు. అయితే...ఈ నాలుగు భాషల్లోనూ రెండో నాయికగా అమీ జాక్సన్ నటిస్తుండడం విశేషమైతే.... ఈ నాలుగు భాషల్లోనూ ఈ చిత్రాన్ని త్యాగరాజన్ నిర్మిస్తుండడం మరో విశేషం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments