భోళా శంకర్ : మరోసారి మెగాస్టార్‌తో జోడీకడుతున్న తమన్నా
Send us your feedback to audioarticles@vaarta.com
సెకండ్ ఇన్నింగ్స్‌లో కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన చిరు, లూసిఫర్ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ను చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఇది కూడా తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేశ్ నటించబోతున్నారు.
అంతా బాగానే వుంది కానీ... ప్రస్తుతం వయసు పైబడిన హీరోలందరికీ హీరోయిన్ సెలక్షన్ పెద్ద సమస్యగా ఉంది. వీళ్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్లాన్ చేస్తుంటారు. కానీ వీరిపక్కన ఆడిపాడే హీరోయిన్ మాత్రం దొరకడం లేదు. ఉన్న ఒకరిద్దరితో సర్దుకుపోవాల్సిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అదే పని చేస్తున్నారు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ఈ సీనియర్ హీరో, మినిమం గ్యాప్స్ లో హీరోయిన్లను రిపీట్ చేస్తున్నారు.
లేటెస్ట్ సమాచారం మేరకు భోళా శంకర్‌లో తమన్నా ను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు మెగా కాంపౌండ్ నుంచి వార్తలు వస్తున్నాయి. గతంలో చిరంజీవితో సైరా నరసింహారెడ్డిలో తమన్నా నటించింది. ఆ చిత్రంలో చిన్న పాత్రే అయినా, సినిమాకు చాలా కీలకమైన రోల్. ఇప్పుడు మరోసారి మెగాస్టార్‌తో నటించడానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. తమిళంలో ఇదే పాత్రను శ్రుతిహాసన్ చేసింది. అయితే సైరా నరసింహారెడ్డి విమర్శకుల ప్రశంసలు అందుకుంది తప్ప.. కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. మరి ఈసారి చిరు-తమన్నా కాంబో హిట్ కొడుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com