ఆడపిల్లల కోసం తమన్నా సినిమా...
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో బాలబాలికలకు విద్య ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమం బేటీ బచావో బేటీ పడావో. దీనికి తమన్నా ప్రచార కార్యకర్తగా వ్యవహరించనుంది. అమ్మాయిల చదువు, అభివృద్ధి తదితర అంశాలతో ఈ సినిమా ఉంటుంది. ఇందులో తమన్నాతో పాటు సన్నీ పవార్ నటించబోతున్నారు. ఈ చిత్రంలో నటించడం తనకెంతో గర్వంగా ఉందని తమన్నా తెలిపారు. ఈ చిత్రానికి `ఏబీసీ` అనే టైటిల్ను కన్ఫర్మ్ చేశారు. ఇండియా యాంటీ కరప్షన్ క్రైం కంట్రోల్ కమిటీ సహకారంతో సినిమా రూపొందనుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ కార్యక్రమానికి మద్ధతు తెలుపుతూ ఇందులో అమితాబ్, చిరంజీవి, సునీల్ శెట్టి, కిరణ్ బేడీ, తదితరులు నటించబోతున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com