రీమేక్‌లో కూడా త‌మ‌న్నానే...

  • IndiaGlitz, [Friday,July 29 2016]

నాగార్జున‌, కార్తీ, త‌మ‌న్నాకాంబినేష‌న్‌లో వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో పివిపి బ్యాన‌ర్‌పై రూపొందిన చిత్రం ఊపిరి. ఫ్రెంచ్ మూవీ ఇన్ ట‌చ్‌బుల్స్ రీమేక్‌గా తెలుగు, త‌మిళంలో విడుద‌లైన ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ సినిమాను చూసిన బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ బాలీవుడ్‌లో ఈ చిత్ర రీమేక్ హ‌క్కుల‌ను కైవసం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా సెక్ర‌ట‌రీ పాత్ర‌లో మెప్పించిన త‌మ‌న్నానే బాలీవుడ్ రీమేక్‌లో తీసుకోవాల‌ని క‌ర‌ణ్‌జోహార్ యోచిస్తున్నాడ‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. త‌మ‌న్నా బాహుబ‌లి 2తో పాటు త‌మిళంలో విశాల్‌, స్వ‌రాజ్ కాంబినేష‌న్ మూవీ క‌త్తిసండై(తెలుగులో ఒక్క‌డొచ్చాడు అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది), అభినేత్రి, చిత్రాలు స‌హా త‌మిళంలో ఓ డీ గ్లామ‌ర్ చిత్రం, బాలీవుడ్‌లో ఓ చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉంది.

More News

త‌మిళంలో 'బాబు బంగారం'

వెంక‌టేష్, నయ‌న‌తార జంట‌గా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `బాబు బంగారం`. ఈ చిత్రం ఆగ‌స్ట్ 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా మారుతి మ‌రోసారి త‌న మార్కు సినిమాను తెర‌కెక్కించాడ‌ని యూనిట్ వ‌ర్గాలు అంటున్నాయి.

సందీప్ హీరోయిన్‌కు నిశ్చితార్థం అయ్యింది...

సందీప్ కిష‌న్ జోరు, నీల‌కంఠ మాయ చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ సుష్మారాజ్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఈ అమ్ముడుకి ఎంగేజ్ మెంట్ అయ్యింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యం మీడియా వ‌ర్గాల‌కు తెలియ‌దు.

ఓవర్ సీస్ లో క్లాసిక్ ఎంటర్ టైన్మెంట్స్ ద్వారా శ్రీరస్తు - శుభమస్తు

అల్లు శిరీష్ -లావణ్య త్రిపాఠి జంటగా పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం శ్రీరస్తు - శుభమస్తు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించారు.

ఓం నమో వేంకటేశాయ తొలి దర్శనం..

నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.

నిర్మాతకు చుక్కలు చూపిస్తున్నయువ హీరో

నిర్మాతకు చుక్కలు చూపిస్తున్న యువ హీరో ఎవరో కాదు...నాగశౌర్య.ఇతను ఏమిటి నిర్మాతకు చుక్కలు చూపించడం ఏమిటి అనుకుంటున్నారా..?