నా లైఫ్ ఛేంజ్ చేసిన సినిమాలు ఇవే అంటున్న తమన్నా..
- IndiaGlitz, [Monday,March 21 2016]
తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటిస్తూ...ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ మిల్కీబ్యూటీ తమన్నా. ప్రస్తుతం తమన్నా తెలుగు, తమిళ్ లో రూపొందిన ఊపిరి చిత్రంలో నటించింది. ఈ నెల 25న ఊపిరి ప్రపంచ వ్యాప్తంగా 2,000 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఊపిరి ప్రమోషన్లో భాగంగా తమన్నా మీడియాతో మాట్లాడుతూ...నేను ముంబాయి నుంచి వచ్చి ఉండచ్చు. తమిళ్, హిందీ చిత్రాల్లో నటించి ఉండచ్చు. కానీ...నా లైఫ్ ఛేంజ్ సినిమాలు మాత్రం తెలుగు సినిమాలే అంటోంది.
నా లైఫ్ ఛేంజ్ చేసిన సినిమా హ్యాపీడేస్ ఇది తెలుగు సినిమా. మరోసారి నా లైఫ్ ఛేంజ్ చేసిన సినిమా బాహుబలి ఇది కూడా తెలుగు సినిమానే. ఇప్పుడు నా లైఫ్ ని ఛేంజ్ చేసే మరో సినిమా ఊపిరి కూడా తెలుగు సినిమానే. అందుచేత తెలుగు సినిమాల్లో నటించడం అంటే గర్వంగా ఫీలవుతాను అంటోంది ఈ మిల్కీబ్యూటీ తమన్నా.