తమన్నా ‘లెవెన్త్ అవర్’ ట్రైలర్ అదిరిపోయింది..
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ఓటీటీల హవా బీభత్సంగా పెరిగిపోయింది. లాక్‌డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఓటీటీ కంటెంట్‌కు మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్ , నెట్ ఫ్లిక్స్, ఆహా అందుబాటులో ఉన్నాయి. మహమ్మారి సెకండ్ వేవ్ కలవరపెడుతున్న సమయంలో మరోమారు ఓటీటీ కంటెంట్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు కొత్త కాన్సెప్ట్స్‌తో బడా బడా నిర్మాతలు సైతం ఓటీటీ కంటెంట్ నిర్మించే పనిలో ఉన్నారు. తమ సిరీస్‌లో నటించేందుకు ఏకంగా స్టార్ హీరోయిన్స్‌నే ఎంచుకుంటున్నారు.
మంచి రెమ్యూనరేషన్ , తక్కువ కాల్ షీట్లు , అద్భుతమైన ఫేమ్ వస్తుండటం తో బడా హీరోయిన్లు కూడా ఓటీటీ బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే సమంత – ఫ్యామిలీ మ్యాన్ 2 ( అమెజాన్ ప్రైమ్ ), కాజల్ – లైవ్ టెలికాస్ట్ ( హాట్ స్టార్ ), శృతి – పిట్టకథలు ( నెట్ ఫ్లిక్స్ ), రాశి ఖన్నా – సన్నీ వంటి సిరీస్‌లో నటిస్తున్నారు. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా కూడా లెవెన్త్ అవర్ అనే సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆహా వేదికగా ఈ లెవెన్త్ అవర్ ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా లెవెన్త్ అవర్‌కు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ‘గరుడవేగ’ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌ను ప్రవీణ్ యూ... నిర్మించారు.
‘‘అనగనగా ఒకరోజు.. రెడ్ రైడింగ్ హుడ్ తన అమ్మమ్మను చూడటానికి బయల్దేరింది.. వెళ్లే దారిలో పెద్ద అడవి.. కొంచెందూరం వెళ్లే సరికి చీకటి పడింది. చీకట్లో పాపం తను దారి తప్పిపోయింది. చీకటి పడగానే ఆకలితో ఉన్న నక్కలు అరవడం మొదలుపెట్టాయి. రెడ్ రైడింగ్ హుడ్‌కి భయం వేసింది’’ అంటూ తమన్నా తన కథను తన కూతురికి చెబుతుండగా ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. తన చుట్టూ ఉన్న రాబందుల్లాంటి మనుషుల నుంచి తమన్నా తనను తాను ఎలా రక్షించుకుంటుందనే కథాంశంతో రూపొందింది. ఆసక్తికరమైన ట్విస్ట్‌లతో ఈ సిరీస్ రూపొందినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. కథ మొత్తం తమన్నా చుట్టూ తిరిగేలా రూపొందించినట్టు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. మొత్తానికి ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఇక సిరీస్ ఇంతకు మించి ఉంటుందని అంచనా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments