త‌మ‌న్నాకి మ‌ళ్ళీ క‌లిసొస్తాయా?

  • IndiaGlitz, [Wednesday,June 06 2018]

తెలుగు, త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు హిందీ ప‌రిశ్ర‌మ‌లోనూ నాయిక‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది త‌మ‌న్నా. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. త‌మ‌న్నా న‌టించిన తాజా చిత్రం నా నువ్వే ఈ నెల 14న విడుద‌లకు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి న‌టిస్తున్న సైరా నర‌సింహా రెడ్డి, త‌ను ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి ప్ర‌స్తుతం నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. అలాగే స‌వ్య‌సాచిలోనూ ఓ ప్ర‌త్యేక గీతంలో సంద‌డి చేయ‌బోతోంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. త‌మ‌న్నా కెరీర్ మొత్తమ్మీద (తెలుగులో) ఇదివ‌ర‌కు న‌టించిన పాత్ర‌ల పేర్లు మ‌ళ్ళీ రిపీట్ అయిన సంద‌ర్భాలు త‌క్కువ. అయితే నా నువ్వే, ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి చిత్రాల కోసం ఇదివ‌ర‌కు చేసిన పాత్రల పేర్ల‌తోనే క‌నిపించ‌నుంది త‌మ‌న్నా. చెప్పుకోద‌గ్గ విజ‌యం సాధించిన బెంగాల్ టైగ‌ర్ చిత్రంలోని మీరా పాత్ర పేరుతోనే నా నువ్వేలో న‌టించ‌గా.. ఘ‌న విజ‌యం సాధించిన 100% ల‌వ్ చిత్రంలోని మ‌హాల‌క్ష్మి పాత్ర పేరుతో ద‌టీజ్ మ‌హాల‌క్ష్మీ చేస్తోంది త‌మ‌న్నా. మ‌రి.. ఇదివ‌ర‌కు క‌లిసొచ్చిన పేర్ల‌తోనే మ‌ళ్ళీ న‌టిస్తున్న త‌మ‌న్నాకు ఆ పేర్లు మ‌ళ్ళీ క‌లిసొస్తాయో లేదో చూడాలి.

More News

స‌మంత ఆ ట్రాక్ రికార్డు సొంతం చేసుకుంటుందా?

అఆ, జ‌న‌తా గ్యారేజ్‌, రాజుగారి గ‌ది2, మెర్స‌ల్ (అదిరింది), రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, ఇరుంబు తిరై (అభిమ‌న్యుడు).. ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది అందాల న‌టి స‌మంత‌.

అప్పుడు 'బాహుబలి'.. ఇప్పుడు 'సైరా'

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది తమన్నా.

మెగాస్టార్ ముఖ్య అతిథిగా 'తేజ్‌ ఐ లవ్ యు' ఆడియో

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో

అప్పుడు శంక‌ర్‌.. ఇప్పుడు పా.రంజిత్‌

ఎంత ఎదిగినా ఒదిగి ఉండమంటారు పెద్దలు. ఈ లక్షణాన్ని అలాగే పుణికి పుచ్చుకున్న నటుడు రజనీ కాంత్.

ద‌స‌రా సంద‌డంతా సునీల్ దేనా?

‘నువ్వేకావాలి’తో కమెడియన్‌గా పరిచయమై.. తక్కువ వ్యవధిలోనే తెలుగులో టాప్ కమెడియన్‌గా ఎదిగారు సునీల్‌.