జాగ్వార్ లో మిల్కీబ్యూటీ స్పెషల్ సాంగ్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూ టర్, ప్రముఖ నిర్మాత హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం జాగ్వార్. హెచ్.డి. కుమారస్వామి సమర్పణలో చెన్నాంబిక ఫిలింస్ పతాకం పై రూపొందుతున్న జాగ్వార్ చిత్రానికి రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రేక్షకులందరికీ నచ్చేవిధంగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో భారీసెట్‌లో హీరో నిఖిల్‌కుమార్, మిల్కీబ్యూటీ తమన్నాలపై ఈ స్పెషల్‌సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ స్పెషల్ సాంగ్ సినిమాలో మరో హైలైట్‌గా నిలవనుంది. ఈ సాంగ్‌ను చిత్రీకరించడంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా అక్టోబర్ 6న వరల్డ్‌వైడ్‌గా జాగ్వార్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్, ఆదిత్యమీనన్, భజ్రంగ్ లోకేష్, అవినాష్, వినాయక్ జోషి, ప్రశాంత్, సుప్రీత్ రెడ్డి, రావు రమేష్, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: హెచ్.డి. కుమారస్వామి, కథ: విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, మ్యూజిక్: యస్.యస్. థమన్, ఆర్ట్: నారాయణరెడ్డి, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్: రవివర్మ, రామ్-లక్ష్మణ్, కలోయాన్ (బల్గేరియా), సెల్వ, కో డైరెక్టర్: అమ్మినేని మాధవసాయి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఎ. మహదేవ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments