'గని'లో తమన్నా స్పెషల్ సాంగ్ ... వీడియో వెర్షన్ వచ్చిందోచ్, పిచ్చెక్కిస్కోన్న మిల్కీబ్యూటీ

  • IndiaGlitz, [Thursday,March 24 2022]

చేతి నిండా సినిమాలతో, అగ్ర కథానాయికగా బిజీగా వున్న సమయంలోనే ‘ఐటెం సాంగ్’ చేసి సంచలనం సృష్టించారు మిల్కీబ్యూటీ తమన్నా. ఈమె చూపిన బాటలోనే మిగిలిన స్టార్ హీరోయిన్స్ కూడా ఐటెం నెంబర్ బాటపట్టారు. అంతేకాదు.. తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గని’లో తమన్నా ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. 'కొడితే...' అంటూ సాగే ఆ గీతాన్ని రెండు నెలల క్రితమే విడుదల చేశారు. ఈ రోజు వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. తమన్నా గ్లామర్, డాన్స్ .. పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ సాంగ్‌కు తమన్ స్వరాలు సమకూర్చగా.. హారికా నారాయణ్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు.

కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ‘‘గని’’ బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అల్లు అరవింద్ సమర్పకుడిగా.. అల్లు బాబీ కంపెనీ, రినైస్సన్స్ పిక్చర్స్ పతాకాల‌పై ‘‘గని’’ని సిద్ధు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలకపాత్ర పోషిస్తున్నారు.

’గని’ మూవీకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా టోటల్ రన్ టైమ్ 2 గంటల 31 నిమిషాల 17 సెకన్లు ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 8న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
 

More News

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో భీమ్లా.. బీమ్లా నాయక్ సంచలనం !!

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో "పవర్" తుఫాను మొదలైంది. ఆ "స్టార్" వెలుగుల సంచలనం ఆరంభమైంది. దాని పేరు "బీమ్లా నాయక్". ఏ పేరు తలిస్తే అభిమానులకు పండగో...

తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపు.. యూనిట్‌కి ఎంత, ఎప్పటి నుంచి అమలంటే..?

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంపునకు టీఎస్ఈఆర్‌సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న డీవీవీ దానయ్య కుమారుడు.. ఆకట్టుకుంటోన్న ‘ఫస్ట్‌ స్ట్రైక్‌’

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇలా ఎక్కడ చూసినా వారసుల ఎంట్రీలు మళ్లీ ఊపందుకున్నాయి.

"గాలివాన' వెబ్ సిరీస్ లో రాధిక  శరత్ కుమార్ క్యారెక్టర్ ప్రోమోను విడుదల చేసిన సీనియర్ నటి కుష్బూ

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా "ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ" మరియు అన్నపూర్ణ స్టూడియోస్ నుండి "లూజర్" లూజర్ 2

ఇక చైనా, నేపాల్‌తో పనిలేదు.. ఇండియా నుంచే డైరెక్ట్‌గా మానస సరోవరానికి: నితిన్ గడ్కరీ

హిందువులు జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే ప్రదేశాల్లో మానస సరోవరం కూడా ఒకటి.