'గని'లో తమన్నా స్పెషల్ సాంగ్ ... వీడియో వెర్షన్ వచ్చిందోచ్, పిచ్చెక్కిస్కోన్న మిల్కీబ్యూటీ
Send us your feedback to audioarticles@vaarta.com
చేతి నిండా సినిమాలతో, అగ్ర కథానాయికగా బిజీగా వున్న సమయంలోనే ‘ఐటెం సాంగ్’ చేసి సంచలనం సృష్టించారు మిల్కీబ్యూటీ తమన్నా. ఈమె చూపిన బాటలోనే మిగిలిన స్టార్ హీరోయిన్స్ కూడా ఐటెం నెంబర్ బాటపట్టారు. అంతేకాదు.. తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గని’లో తమన్నా ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. 'కొడితే...' అంటూ సాగే ఆ గీతాన్ని రెండు నెలల క్రితమే విడుదల చేశారు. ఈ రోజు వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. తమన్నా గ్లామర్, డాన్స్ .. పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ సాంగ్‌కు తమన్ స్వరాలు సమకూర్చగా.. హారికా నారాయణ్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు.
కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ‘‘గని’’ బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పకుడిగా.. అల్లు బాబీ కంపెనీ, రినైస్సన్స్ పిక్చర్స్ పతాకాలపై ‘‘గని’’ని సిద్ధు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలకపాత్ర పోషిస్తున్నారు.
’గని’ మూవీకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా టోటల్ రన్ టైమ్ 2 గంటల 31 నిమిషాల 17 సెకన్లు ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 8న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com