అది వాస్త‌వం కాదు అంటున్న త‌మ‌న్నా..!

  • IndiaGlitz, [Monday,November 14 2016]

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ప్ర‌స్తుతం విశాల్ స‌ర‌స‌న ఒక్క‌డొచ్చాడు చిత్రంలో న‌టిస్తుంది. సూర‌జ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హ‌రి తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 18న రిలీజ్ కానుంది. ఈ చిత్రంతో పాటు త‌మ‌న్నాసంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి 2 లో న‌టిస్తుంది. ఏప్రిల్ 28న బాహుబ‌లి 2 చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే... క‌పిల్ శ‌ర్మ క‌థానాయ‌కుడుగా న‌టించ‌నున్న చిత్రంలో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా న‌టించ‌నున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యం పై త‌మ‌న్నా ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ....ఆ వార్త‌ల్లో నిజం లేదు. నేను ఏ సినిమాకైనా సైన్ చేస్తే ఆ మూవీ గురించి మాట్లాడ‌తాను. అందుచేత ద‌య‌చేసి ఇలాంటి రూమర్స్ ను ఎంక‌రేజ్ చేయ‌ద్దు అని తెలియ‌చేసింది. అది సంగ‌తి..!