త‌మ‌న్నా పాత్ర ఏంటంటే?

  • IndiaGlitz, [Thursday,April 26 2018]

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఇప్పుడు క్వీన్ ప్రాజెక్ట్ పెండింగ్ ప‌డ‌టంతో త‌దుప‌రి సినిమాపై దృష్టి సారించింది. ఇది కాకుండా తెలుగులో చిరంజీవి 151వ చిత్రం 'సైరా న‌రసింహారెడ్డి'లో కీల‌క పాత్ర న‌టించ‌బోతుంది. త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి జంట‌గా త‌మ‌న్నా న‌టించ‌నుంద‌నే వార్త‌లు వినిపించాయి.

ఈ నేపథ్యంలో త‌మ‌న్నా పాత్ర గురించి కొన్ని విష‌యాలు తెలిశాయి అవేంటంటే.. త‌మ‌న్నా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి గురించి ప్రాణ త్యాగం చేసే పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని. ఈ పాత్ర నిడివి కొద్ది సేపే ఉన్నా కూడా పాత్రకు ప్రాముఖ్య‌త ఉండ‌టంతో త‌మ‌న్నా పాత్ర‌లో న‌టించ‌డానికి అంగీక‌రించింద‌ట‌.