ఇంటికి చేరుకున్న తమన్నా...

  • IndiaGlitz, [Thursday,October 15 2020]

తమన్నా ఇంటికి చేరుకోవడమేంటి? అనే సందేహం కలుగక మానదు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన ఈ మిల్కీబ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేస్తూ 'హోం కమింగ్‌' అంటూ మెసేజ్‌ను కూడా షేర్‌ చేశారు. ఇంతకూ తమన్నా ఆ వీడియోను షేర్‌ చేయడం వెనుక కారణం.. ఆమెకు కోవిడ్‌ సోకడమే. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన ఈ అమ్మడు, ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చిన తర్వాత ఓ డిజిటల్‌ మాధ్యమంలో ఓ కార్యక్రమంలో నటించడానికి అంగీకరించింది. అందుకోసం ఇటీవల కాలంలో హైదరాబాద్‌ వచ్చింది. ఆ సమయంలో ఆమెకు కరోనా వైరస్‌ సోకింది. ఎంతో జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉన్నప్పటికీ తనకు కరోనా సోకిందని, ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని కూడా తమన్నా చెప్పింది.

అది వరకే ఆమె తల్లిదండ్రులకు కరోనా వచ్చింది. దీంతో వెంటనే తమన్నా ఇంటికి వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే కరోనా పూర్తిస్థాయిలో తగ్గేవరకు రెస్ట్‌ తీసుకుని షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసేసి ముంబై చేరుకుంది. ''నేను ఇంత త్వరగా రికవర్‌ అయ్యి ఇల్లు చేరుతానని అనుకోలేదు. అభిమానులు, శ్రేయోభిలాషుల వల్లనే ఇది సాధ్యమైంది. అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతానికి బలాన్ని సంపాదించుకోవాలి'' అంటూ వీడియో ద్వారా తమన్నా తను ఇల్లు చేరుకున్న విషయాన్ని తెలియజేసింది. సినిమాల విషయానికి వస్తే సత్యదేవ్‌తో 'గుర్తుందా శీతాకాలం' సినిమాతో పాటు నితిన్‌ చేస్తున్న బాలీవుడ్‌ రీమేక్‌ 'అంధాదున్‌' చిత్రంలోనూ తమన్నా నటిస్తున్నారు.

More News

సాయితేజ్ బర్త్‌డే సందర్భంగా చిరు ఆసక్తికర ట్వీట్..

సుప్రీం హీరో సాయితేజ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

అవినాష్ మాస్క్‌ని తొలగిస్తున్నాడా?

నిన్నటి అమితుమీ టాస్క్ ఇవాళ కూడా కంటిన్యూ అయ్యింది. బిగ్‌బాస్ డీల్ ఇస్తారు.

మంత్రి వెల్లంపల్లికి మళ్లీ అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు..

దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నట్టే కోలుకుని తిరిగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

`బ్లాక్డ్` మూవీ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

మ‌నోజి నందం, శ్వేత సాలూరు హీరోహీరోయిన్లుగా థ్యాంక్యూ ఇన్‌ఫ్రా టాకీస్ ప‌తాకంపై రామ్ లొడ‌గ‌ల ద‌ర్శ‌కత్వంలో

ప్రముఖ సినీ నటుడు సచిన్ జోషి అరెస్ట్..

ప్రముఖ సినీ నటుడు సచిన్ జోషిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్కా అక్రమ రవాణా ఆరోపణలు రావడంతో హైదరాబాద్ పోలీసులు..