ఆ విషయంలో సమంతలా నేను ఎందుకు చేయాలి..? - తమన్నా
Send us your feedback to audioarticles@vaarta.com
అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ఒక్క తెలుగులోనే కాకుండా సౌత్ లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న హీరోయిన్ మిల్కీబ్యూటీ తమన్నా. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతున్న అభినేత్రి సినిమాలో తమన్నా నటించింది. తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ ప్రధాన పాత్రలు పోషించిన అభినేత్రి చిత్రాన్ని విజయ్ తెరకెక్కించారు. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో రూపొందిన అభినేత్రి చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 7న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మిల్కీబ్యూటీ తమన్నాతో ఇంటర్ వ్యూ మీకోసం..!
అభినేత్రి స్టోరీ ఏమిటి..?
ఇది ఒక డిఫరెంట్ హర్రర్ కామెడీ స్టోరీ. నేను హర్రర్ స్టోరీ నటించడం ఇదే ఫస్ట్ టైమ్. స్టోరీ ఏమిటి అని చెబితే కథ అంతా తెలిసిపోతుంది. అందుచేత కథ గురించి ఇంతకు మించి చెప్పను మీరు స్ర్కీన్ పై చూడాల్సిందే..!
ప్రభుదేవాతో నటిస్తున్నప్పుడు ఎలా ఫీలయ్యారు..?
ప్రభుదేవాతో నటిస్తున్నాను అని తెలిసి చాలా ఎగ్జైట్ అయ్యాను. అయితే...రేపు ప్రభుదేవ గారితో షూటింగ్ అనగా ఈరోజు రాత్రి నిద్రపట్టేది కాదు. ఆయన మాత్రం సెట్ లో చాలా సింపుల్ గా ఉండేవారు. అలాగే అప్పటి వరకు మాతో ఉన్న ప్రభుదేవ కెమెరా ముందుకు వెళ్లగానే ఆ పాత్రలోకి వెళ్లిపోయి నటించేసేవారు. నేను ఆయనలా చేయలేకపోయాను.
హర్రర్ కామెడీ ఫిల్మ్స్ చాలా వస్తున్నాయి కదా...అభినేత్రిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి..?
ఇది కేవలం హర్రర్ కామెడీ ఫిల్మ్ మాత్రమే కాదు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ ఉన్నాయి. ప్రభుదేవ గారు చెప్పినట్టుగా హర్రర్ ఫిల్మే కానీ ఇందులో దెయ్యం ఎక్కడా కనిపించదు.
ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా నటించారు కదా..ఈ క్యారెక్టర్ చేయడం కోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు..?
కమల్ హాసన్ గారి సినిమాలో రేవతి గారు నటించిన పాత్రను అబ్జర్వ్ చేసాను. అలాగే నా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ...విషయంలో డైరెక్టర్ విజయ్ చాలా కేర్ తీసుకున్నారు. అందుచేత ఆయన ఏం చెబితే అది చేసాను.
తమన్నా అంటే డ్యాన్స్ బాగా చేస్తుంది అని తెలుసు...ఈ సినిమాలో మా అంచనాలను పెంచేసేలా డ్యాన్స్ చేసారు కారణం..?
నాకు డ్యాన్స్ వచ్చు కాబట్టి ఏదో డ్యాన్స్ చేయాలి అని చేయలేదు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి తగ్గట్టే డ్యాన్స్ చేసాను. ఈ సాంగ్ కోసం 15 రోజులు రిహార్సల్స్ చేసి చేసాను. ఈ రోజు ఈ సాంగ్ గురించి అందరూ మాట్లాడుతుండడం చాలా సంతోషంగా ఉంది.
అభినేత్రి ఆడియో ఫంక్షన్ లో నాని మీలా డ్యాన్స్ చేయలేను అని చెప్పారు కదా నాని అలా చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది..?
హీరోలు అందరూ డ్యాన్స్ బాగా చేస్తున్నారు. హీరోయిన్స్ మాత్రం ఎక్కువుగా డ్యాన్స్ చేయడం లేదు. అందుచేత నేను డ్యాన్స్ చేసే సరికి నాని అలా కాంప్లిమెంట్ ఇచ్చాడు. భవిష్యత్ లో హీరోలే కాకుండా హీరోయిన్స్ కూడా బాగా డ్యాన్స్ చేసే రోజులు వస్తాయి అనిపిస్తుంది.
హీరోల్లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు..?
ఒక్కరు అని ఏమీ లేదు అందరూ బాగానే చేస్తున్నారు. బన్ని, చరణ్, ఎన్టీఆర్...ఇలా అందరూ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు.
డైరెక్టర్ విజయ్ లో ఉన్న ప్రత్యేకత ఏమిటి..?
ఆయన సెట్ లో చాలా కూల్ గా ఉంటారు. ఆయన సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ కి చాలా డెప్త్ ఉంటుంది. అలాగే ప్రతి సీన్ ని అర్ధమయ్యేలా డీటైల్ గా చెబుతుంటారు. విజయ్ గారు అమేజింగ్ డైరెక్టర్.
జాగ్వార్ లో స్పెషల్ సాంగ్ చేసారు కదా కారణం..?
నా వల్ల ఒక సినిమాకి అదనపు ఆకర్షణ వస్తుంది అంటే స్పెషల్ సాంగ్ చేస్తే తప్పు ఏమిటి అని నా ఫీలింగ్. పైగా రెమ్యూనరేషన్ కూడా బాగున్నప్పుడు స్పెషల్ సాంగ్ చేయడానికి అభ్యంతరం ఏమి ఉంటుంది.
మిల్కీబ్యూటీ గ్లామర్ సీక్రెట్ ఏమిటి..?
నేను ఎక్కువుగా హోమ్ ఫుడ్డే తింటాను. అలాగే డైట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాను. రోటీ, సబ్జా, డాల్ ఎక్కువ తీసుకుంటాను అదే నా గ్లామర్ సీక్రెట్ అనుకుంటున్నాను.
సమంత పెళ్లి చేసుకుంటుంది కదా...మరి మీ పెళ్లి ఎప్పుడు..?
సమంత పెళ్లి చేసుకుంటే నేను కూడా పెళ్లి చేసేసుకోవాలా..? (నవ్వుతూ...)
ఊపిరి టైమ్ లో బాహుబలి 2 లో మీ రోల్ తక్కువుగా ఉంటుంది అని చెప్పారు కానీ...బాహుబలి 2లో మీరోల్ ఎక్కువుగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది నిజమేనా..?
బాహుబలి 2 రిలీజ్ అయ్యే వరకు ఆగండి నిజం మీకే తెలుస్తుంది (నవ్వుతూ..)
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments