తమన్నా చేయడం లేదట
Send us your feedback to audioarticles@vaarta.com
మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం బ్రూస్ లీ` లో ఓ ఐటెమ్ సాంగ్ చేయనుందనే వార్తలు వినపడ్డాయి. ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా నటిస్తాడనే వార్త కూడా షికారు చేసింది.
అయితే బ్రూస్ లీ` చిత్రంలో తానెటువంటి సాంగ్ చేయడం లేదని, అందుకు సంబంధించి తననెవరూ సంప్రదించలేదని ట్వీట్టర్లో చెప్పుకొచ్చింది. మొత్తం మీద తమన్నా తనపై వస్తున్న పుకార్లకు బ్రేక్ వేసింది. ప్రస్తుతం తమన్నా నాగ్, కార్తీల ఊపిరి` సినిమాతో బిజీగా ఉంది. ఇంత వరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు బ్రూస్ లీ చిత్రంలో ఐటెమ్ సాంగ్ లో ఎవరూ నర్తిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com