తమన్నా చేయడం లేదట

  • IndiaGlitz, [Saturday,September 19 2015]

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం బ్రూస్ లీ' లో ఓ ఐటెమ్ సాంగ్ చేయనుందనే వార్తలు వినపడ్డాయి. ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా నటిస్తాడనే వార్త కూడా షికారు చేసింది.

అయితే బ్రూస్ లీ' చిత్రంలో తానెటువంటి సాంగ్ చేయడం లేదని, అందుకు సంబంధించి తననెవరూ సంప్రదించలేదని ట్వీట్టర్లో చెప్పుకొచ్చింది. మొత్తం మీద తమన్నా తనపై వస్తున్న పుకార్లకు బ్రేక్ వేసింది. ప్రస్తుతం తమన్నా నాగ్, కార్తీల ఊపిరి' సినిమాతో బిజీగా ఉంది. ఇంత వరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు బ్రూస్ లీ చిత్రంలో ఐటెమ్ సాంగ్ లో ఎవరూ నర్తిస్తారో చూడాలి.