ఒక్కడొచ్చాడు డైరెక్టర్ సూరజ్ పై ఫైర్ అయిన తమన్నా
Send us your feedback to audioarticles@vaarta.com
విశాల్, తమన్నా జంటగా నటించిన చిత్రం ఒక్కడోచ్చాడు. ఈ చిత్రాన్నిసూరజ్ తెరకెక్కించారు. తెలుగు, తమిళ్ లో రూపొందిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. డైరెక్టర్ సూరజ్ హీరోయిన్స్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ ఏం జరిగింది అంటే... ఒక్కడోచ్చాడు ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో తమన్నా షార్ట్ డ్రెస్సెస్ & స్కిన్ షో పై సూరజ్ ని అడిగితే...హీరోయిన్స్ కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మాస్ ఆడియోన్స్ హీరోయిన్స్ గ్లామర్ కోసం థియేటర్స్ కి వస్తుంటారు. అందుచేత హీరోయిన్స్ స్కిన్ షో చేసి తీరాలి. నేనైతే కాస్ట్యూమ్ డిజైనర్ మోకాలి కింది వరకు డ్రెస్ తీసుకు వస్తే కట్ చేయమని చెబుతాను.
ఏక్టింగ్ స్కిల్స్ చూపించాలి అంటే సీరియల్స్ లో చూపించవచ్చు. కమర్షియల్ సినిమాలో అయితే స్కిన్ షో చేయాల్సిందే అన్నారు.సూరజ్ కామెంట్స్ పై నయనతార ఫస్ట్ ఫైర్ అయ్యారు. నేను ఇప్పటి వరకు పాత్రకు తగ్గట్టే స్కిన్ షో చేసాను. ఆడియోన్స్ కు సూరజ్ కంటే మంచి టేస్ట్ ఉంది. హీరోయిన్స్ గ్లామర్ కోసం థియేటర్స్ కి రావడం లేదు అంటూ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఆతర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా సూరజ్ పై ఫైర్ అయ్యింది. మనం 2016లో ఉన్నాం. పింక్, దంగల్ తరహా సినిమాలు వస్తున్న ప్రస్తుత తరుణంలో సూరజ్ ఇలా మాట్లాడడం చాలా బాదాకరం. సూరజ్ ఖచ్చితంగా క్షమపణలు చెప్పాల్సిందే. మేము ఆడియోన్స్ ను ఎంటర్ టైన్ చేయాలి అనుకుంటాం. మమ్మల్ని వస్తువుల్లా చూడకండి అంటూ సూరజ్ పై ఫైర్ అయ్యింది మిల్కీబ్యూటీ..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com