తమన్నా.. వరుసగా మూడో ఏడాది
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినీ పరిశ్రమలో డ్యాన్సులకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో వేరేగా చెప్పనక్కరలేదు. ఈ విషయంలో హీరోలదే హవా. అయితే ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలతో సమానంగా స్టెప్స్ వేసే హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం.. ఠక్కున తమన్నా పేరు వినబడుతుంది. కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన తొమ్మిదేళ్ళ తరువాత.. తొలిసారిగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘అల్లుడు శీను’ (2014) సినిమా కోసం ఓ ఐటమ్ సాంగ్‌లో నర్తించిందీ మిల్కీ బ్యూటీ. ఆ తరువాత వెంటనే ఐటెం సాంగ్స్ చేయకపోయినా.. అడపాదడపా ఆ వైపు అడుగులు వేస్తోంది.
ఇప్పటివరకు మొత్తం నాలుగు ఐటెం సాంగ్స్ చేసిన తమన్నా.. తాజాగా నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘సవ్యసాచి’ సినిమాలోనూ ఓ ఐటమ్ సాంగ్ చేయడానికి అంగీకరించింది. 25 ఏళ్ళ క్రితం విడుదలైన 'అల్లరి అల్లుడు' చిత్రంలోని 'నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గాయత్తు' అనే పాట తాలుకు రీమిక్స్‌లో ఈ మిల్కీ బ్యూటీ మెరవనుంది. విశేషమేమిటంటే.. గత రెండు సంవత్సరాల్లోనూ ప్రత్యేక గీతాలు చేసిన తమన్నాకి ఐటెం గర్ల్‌గా వరుసగా ఇది మూడో ఏడాది కావడం విశేషం.
2016లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన ‘స్పీడున్నోడు’ చిత్రంతో పాటు 'జాగ్వార్' అనే కన్నడ చిత్రంలోనూ తన డ్యాన్సులతో అలరించిన తమన్నా.. గత ఏడాది (2017) యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’లోని ప్రత్యేక గీతం కోసం నర్తించి ప్రేక్షకులకి కనువిందు చేసింది. మొత్తానికి.. వరుసగా మూడేళ్ళపాటు తమన్నా ఐటెం గర్ల్‌గా సందడి చేస్తుందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com