తమన్నా బర్త్ డే సెలబ్రేషన్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
అందం, అభినయం ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది కథానాయికల్లో మిల్కీబ్యూటీ తమన్నా ఒకరు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తమన్నా పుట్టినరోజు డిసెంబర్ 21. ఈ సందర్భంగా తమన్నాకు తెలుగు ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు. ఇంతకీ...తమన్నాకు బర్త్ డే పార్టీ ఇచ్చింది ఎవరో కాదు రామ్ చరణ్ దంపతులు. వీరితో పాటు అక్కినేని అఖిల్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ పార్టీలో పాల్గొని తమన్నాతో కేక్ కట్ చేయించి బర్త్ డే విషెస్ తెలియచేసారు.
ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ...బర్త్ డే సందర్భంగా ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ ను కలవడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ లో ఉన్నప్పుడు ఏ సినిమా షూటింగ్ చేస్తున్నామో ఆ హీరోతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పార్టీల వలన ఫ్రెండ్స్ అందరితో కలిసి టైమ్ స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది అంటూ తన సంతోషాన్ని షేర్ చేసుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com