‘మాస్టర్ చెఫ్ తెలుగు’ .. హోస్ట్‌గా అనసూయ, కోర్టుకెక్కిన తమన్నా
Send us your feedback to audioarticles@vaarta.com
సీరియల్స్, సినిమాలు, ఐపీఎల్ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి రియాలిటీ షోలు ప్రయత్నిస్తున్నాయి. ఏకంగా తెలుగు తెరపై టాప్ స్టార్లను రంగంలోకి దించి టీవీ ఛానెల్స్ నిర్వహిస్తున్న షోలకు జనం నుంచి ఆదరణ లభించడం లేదని టీఆర్‌పీ రేటింగ్‌లు చెబుతున్నాయి. ప్రస్తుతం మా టీవీలో నాగార్జున హోస్ట్‌గా వస్తున్న బిగ్‌బాస్, జెమినీ టీవీలో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు... అలాగే తమన్నా భాటియా హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది తమన్నా హోస్ట్‌గా చేస్తున్న ‘మాస్టర్ చెఫ్ తెలుగు’ షో గురించే. అయితే పలు కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ నుంచి ఆమె తప్పుకున్నారు . తాజాగా ఈ ప్రోగ్రాం విషయంలో తమన్నా కోర్టును ఆశ్రయించి ప్రొడక్షన్ హౌజ్‌కి షాకిచ్చిందట.
వివరాల్లోకి వెళితే.. ‘మాస్టర్ చెఫ్ తెలుగు’ కార్యక్రమం రేటింగ్స్ విషయానికి వస్తే.. మొదట్లో బాగానే వచ్చినా, ఇటీవల మాత్రం జనం నుంచి రెస్పాన్స్ రావడం లేదు. దీంతో తమన్నాను తప్పించిన నిర్వాహకులు.. హాట్ యాంకర్ అనసూయకు ఛాన్స్ ఇచ్చారు. అనసూయ వల్ల ఈ షోకి మళ్లీ మంచి రేటింగ్ సాధిస్తుందనే హోప్‌తో ప్రొడక్షన్ హౌస్ నిర్వాహకులు ఉన్నారు. అయితే అనూహ్యంగా తనను మధ్యలోనే తొలగించడంపై మనస్తాపానికి గురైన తమన్నా తనకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రొడక్షన్ హౌజ్‌కు లీగల్ నోటీసులు పంపించింది. మాస్టర్ చెఫ్ కార్యక్రమం కోసం తమన్నా పలు కీలక ప్రాజెక్టులు వదులుకొన్నారని.. తొలి సీజన్‌ను పూర్తి చేయడానికి కొన్ని ముఖ్యమైన పనులను కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చిందని ఆమె తరపు లాయర్ తెలిపారు. తమన్నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అనసూయకు హోస్ట్ బాధ్యతలు అప్పగించినట్లుగా ఆయన వెల్లడించారు. మరి దీనిపై ‘మాస్టర్ చెఫ్ తెలుగు’ను ప్రోడ్యూస్ చేస్తున్న ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments