తమన్నా'బ్యాక్ టు బ్యాక్' ముచ్చట
Send us your feedback to audioarticles@vaarta.com
'శ్రీ' సినిమాతో కథానాయికగా తొలి అడుగులు వేసింది తమన్నా. 2005లో ఆ చిత్రం రిలీజైంది. అంటే పదేళ్లుగా తమన్నా టాలీవుడ్‌లో తన నటనతో అలరిస్తోందన్నమాట. అయితే ఇన్నేళ్ల కెరీర్‌లో 'హ్యాపీడేస్', '100% లవ్', 'రచ్చ', 'తడాఖా', 'బాహుబలి'..ఇలా పరిమిత సంఖ్యలో మాత్రమే విజయాలను మూటగట్టుకుంది తమన్నా. అయితే ఇవేవి వరుస విజయాలు కాదు. సంవత్సరానికో, రెండు మూడు సంవత్సరాలకో ఒకసారి దక్కిన హిట్స్.
ఈ నేపథ్యంలో చాన్నాళ్లుగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ని తెలుగులో పొందాలనుకుంటున్న తమన్నాకి 'బెంగాల్ టైగర్' ఆ కోరిక నెరవేర్చే అవకాశం ఉందని వినిపిస్తోంది. రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రస్తుతానికైతే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇదే పాజిటివ్‌నెస్ కొనసాగి.. ఆ సినిమా సక్సెస్ సాధిస్తే గనుక.. టాలీవుడ్‌లో రెండు వరుస విజయాలను ఇప్పటివరకు చూడని తమన్నాకి ఆ ముచ్చటా తీరుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments