దటీజ్ మహాలక్ష్మిగా రాబోతున్న హీరోయిన్ తమన్నా
Send us your feedback to audioarticles@vaarta.com
క్వీన్ రీమేక్ సెట్స్ లో హీరోయిన్ పరుల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ మైసూర్ లో శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ స్పాట్ లో పరుల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.
చిత్ర బృందంతో పాటు హీరోయిన్ కాజల్, హీరోయిన్ తమన్నా పాల్గొనడం జరిగింది. ఈ మూవీ తమిళ వర్షన్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. దర్శకుడు రమేష్ అరవింద్ కన్నడ, తమిళ్ వర్షన్ క్వీన్ రిమేక్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా హీరోయిన్ పరుల్ యాదవ్ మాట్లాడుతూ... "ఇది నాకు స్పెషల్ పుట్టినరోజు. ఈ చిత్రానికి పని చెయ్యడం మర్చిపోలేని అనుభూతి" అన్నారు.
క్వీన్ తెలుగు రీమేక్ లో తమన్నా మెయిన్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి 'దటీజ్ మహాలక్ష్మి' పేరును ఖరారు చేసినట్లు తమన్నా తెలిపింది.
100% లవ్ చిత్రంలో తమన్నా పాత్ర పేరు 'దటీజ్ మహాలక్ష్మి' తను మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రానికి అదే టైటిల్ పెట్టడం ఆనందంగా ఉందని తమన్నా చెప్పడం జరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com