తెలుగు క్వీన్ గా తమన్నా...

  • IndiaGlitz, [Wednesday,September 06 2017]

బాలీవుడ్ సూప‌ర్‌హిట్ మూవీ క్వీన్‌ను ద‌క్షిణాది తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాలంలో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వేర్వేరు భాష‌ల్లో వేర్వేరు హీరోయిన్ క్వీన్‌గా న‌టిస్తుంది. క‌న్న‌డలో పారుల్ యాద‌వ్ క్వీన్‌గా న‌టిస్తుంది. త‌మిళంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ క్వీన్‌గా న‌టిస్తుంది.

తెలుగులో క్వీన్‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేకుండా ఉండింది. ఎట్ట‌కేల‌కు తెలుగులో క్వీన్ ఎవ‌రో తెలిసిపోయింది. తెలుగు క్వీన్‌గా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టించ‌నుంది. ఈ సినిమాను జాతీయ అవార్డు విన్నింగ్ డైరెక్ట‌ర్ నీల‌కంఠ తెర‌కెక్కించ‌నున్నార‌ని విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం. మరి మల‌యాళ క్వీన్‌గా ఎవ‌రు న‌టించ‌నున్నార‌నేది ఇంకా క్లారిటీ రాలేదు. త్వ‌ర‌లోనే మ‌ల‌యాళ క్వీన్ ఎవ‌రో తెలియ‌నుంది.