అనుష్క తరువాత తమన్నానే..
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పన్నెండేళ్లు అవుతున్నా.. టాప్ లీగ్‌లోనే కొనసాగుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర తారగా పేరు తెచ్చుకున్న తమన్నా.. ఈ రెండు భాషల్లోనూ ఇప్పటికీ బిజీగానే ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తమన్నా తమిళంలో 'స్కెచ్' అనే సినిమా చేస్తోంది. చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హోమ్లీ లుక్స్‌తో సందడి చేయనుంది. విక్రమ్‌తో ఈ మిల్కీ బ్యూటీ కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం.
ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. 'స్కెచ్'తో తమిళంలో ఈ జనరేషన్ టాప్ హీరోలందరితోనూ కలిసి నటించిన రెండో హీరోయిన్‌గా తమన్నా గుర్తింపు తెచ్చుకుంటోంది. సూర్యతో అయన్ (వీడొక్కడే), విజయ్‌తో (సురా), అజిత్ తో వీరమ్ (వీరుడొక్కడే) చిత్రాలు చేసిన తమన్నా.. ప్రస్తుతం విక్రమ్‌తో 'స్కెచ్' చేస్తోంది. ఇదివరకు ఈ నలుగురు హీరోలతోనూ అనుష్క కలిసి నటించింది. ఇక తమన్నా తోటి హీరోయిన్లు అయిన కాజల్, శ్రుతి హాసన్, సమంత తదితరులకు ఇంకా ఒక్కో హీరో బాకీ పడే ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments