ప్రేమ, సెక్స్ గురించి తమన్నా ఏమంది?
- IndiaGlitz, [Monday,December 03 2018]
ఇప్పుడున్న యూత్ మనోభావాలు దెబ్బ తినకుండా స్వతంత్య్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రేమ, సెక్స్ అనేవి చాలా సాధారణ విషయాలు అని అంటుంది తమన్నా. వాటి గురించి బోల్డ్‌గా మాట్లాడే యువతి పాత్రలో తాను కనపడబోతున్నట్లు తమన్నా చెప్పింది. అసలు ప్రేమ, సెక్స్ గురించి అంత బోల్డ్‌గా తమన్నా ఏం చెప్పిందో తెలుసుకోవాలంటే 'నెక్స్ట్ ఏంటి' సినిమా చూడాల్సిందేనట.
లండన్ నేపథ్యంలో సాగే ఈ యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్లో రొమాంటిక్ లవ్‌స్టోరీ.. తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధం... ఎమోషన్స్ అన్నీ ఉంటాయట. నేటి యూత్‌ను రెప్రంజెట్ చేసే కల్చర్ ఉన్న ఇలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కునాల్ కొహ్లి ఈ కథతో తన వద్దకు వచ్చాడని.. అందుకే ఓకే చేసేశానని చెప్పింది మిల్కీ బ్యూటీ.