డేటింగ్‌పై తమన్నా రిప్లై
- IndiaGlitz, [Friday,March 01 2019]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో తమన్నా భాటియా ఒకరు. ఈమె హీరోయిన్గా ఎదిగే క్రమంలో చాలా రూమర్స్ వచ్చాయి. అందులో ముఖ్యమైంది ప్రస్తుత ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లితో తమన్నా డేటింగ్లో ఉందనే వార్త. విరాట్, తమన్నా కలిసి 2012లో ఓ యాడ్‌లో నటించారు. అప్పటి నుండి తమన్నాపై ఈ రూమర్ క్రియేట్ అయ్యింది. ఈ వార్త గురించి ఫేమస్లీ ఫిలింఫేర్లో ప్రస్తావిస్తే..
అసలు తాను, విరాట్ కోహ్లితో యాడ్ సమయంలో నాలుగైదు మాటలు మాట్లాడుకున్నాం. అది కూడా ప్రొఫెషనల్‌గా మాత్రమే. తర్వాత తనను కలవనే లేదు' అంటూ చెప్పుకొచ్చిన తమన్నా, అమెరికాకు చెందిన డాక్టర్ని పెళ్లి చేసుకోబోతుందని వచ్చిన వార్తలను కూడా ఖండించారు. విరాట్ కోహ్లి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లి చేసుకున్నాడు.