అదేమిటో చెబితే అంద‌రికీ ఆశ్చ‌ర్య‌మే - త‌మ‌న్నా..!

  • IndiaGlitz, [Monday,November 28 2016]

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ సంవ‌త్స‌రం ఊపిరి, అభినేత్రి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. స్పెష‌ల్ సాంగ్ లో కూడా కనిపించి క‌నువిందు చేసింది. ఇదిలా ఉంటే...ఈ సంవ‌త్స‌రం బాగానే గ‌డిచింది. ఇక వ‌చ్చే సంవ‌త్స‌రం చేసే సినిమాలు చెబితే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతారు అంటుంది మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. ఇంత‌కీ అంతలా ఆశ్చ‌ర్యం క‌లిగించే ఆ సినిమాలు ఏమిటి అని మాత్రం నన్ను అడ‌గ‌ద్దు అని చెబుతుంది.

కానీ...నా ఫ్యాన్స్ మాత్రం బాగా ఆనందిస్తారు. నేను ఆ సినిమాల్లో న‌టిస్తున్నాను అంటే చాలా మంది మాత్రం షాక్ అవుతారు అని అంటుంది. కేవ‌లం ఒక్క సినిమా అని కాదు నేను అంగీక‌రించిన కొన్ని సినిమాలు చెబితే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు అంటూ అస‌లు విష‌యం చెప్ప‌కుండా ఊరిస్తుంది. అంత‌లా ఆశ్చ‌ర్యం క‌లిగించే త‌మ‌న్నా చేయ‌నున్న సినిమాలు ఏమిటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!

More News

చైతు మూవీ గురించి నాగ్..!

ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో... ఈ రెండు చిత్రాలతో వరుస విజయాలు సాధించిన అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

గౌత‌మీపుత్రశాత‌క‌ర్ణి ఆడియో & ర‌న్ టైమ్ డీటైల్స్..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి విజయం సాధించాలి అని కోరుకుంటూ అభిమానులు ఫిల్మ్ న‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో రుద్రాభిషేకం నిర్వ‌హించారు.

ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ మూవీ షూటింగ్ డీటైల్స్..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో మూడ‌వ చిత్రం ఇటీవ‌ల రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే.

చ‌ర‌ణ్ - సుకుమార్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నతాజా చిత్రం ధృవ. స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ గా రూపొందిన ధృవ  చిత్రం  ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

ఓం నమో వేంకటేశాయ అప్పుడు రిలీజ్ అయితే గొప్పే - నాగ్..!

నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్నభక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.