tamanna bhatia : అది బ్రానా, టాపా... ఏంటో చెప్పమ్మా .. సెగలు రేపుతోన్న తమన్నా అందం
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. మహా అయితే ఐదేళ్లు, లేదా మంచి హిట్లు పడితే ఇంకో రెండేళ్లు అంతేకానీ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోని హీరోయిన్ల మాదిరి దశాబ్ధాల తరబడి వెండితెరను ఏలడం కుదరని పని. కానీ ఈ తరంలోనూ కొందరు హీరోయిన్లు మాత్రం ఇందులో ఎలాంటి నిజం లేదని నిరూపించారు. అనుష్క, నయనతార, శ్రియ, కాజల్ , త్రిష వంటి వారు సుదీర్ఘకాలంగా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఎన్ని కొత్త అందాలు దూసుకొస్తున్నా... తమ నటనతోనూ ఇంకా ప్రేక్షకులను అలరిస్తూనే వున్నారు. ఇలాంటి వారిలో ఒకరు మిల్కీ బ్యూటీ తమన్నా.
18 ఏళ్లుగా వెండితెరను ఏలుతోన్న మిల్కీ బ్యూటీ:
పాల వంటి మేనిఛాయతో ముట్టుకుంటే కందిపోతుందా అన్నంతలా తమన్నా మెరిసిపోతూ వుంటారు. 2005లో మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ చిత్రం ద్వారా తమన్నా తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. అంటే దాదాపు 18 సంవత్సరాలు. ఇన్నేళ్లలో , ఇన్ని సినిమాలు చేసినా ఆమెకు చెప్పుకోదగ్గ హిట్లు అంతంత మాత్రమే. అయినప్పటికీ తమన్నా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్నారంటే ఆమె సత్తా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లోనే కాదు.. దక్షిణాదిలో డ్యాన్సుల్లో ఆమెతో పోటీపడగల హీరోయిన్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఎన్ని ఫ్లాప్స్ ఎదురవుతున్నా... ఒక్క హిట్‌తో మళ్లీ నిలబడటం తమన్నాకి మాత్రమే సాధ్యం.
అది బ్రానో, టాపో అర్ధం కాక జుట్టు పీక్కుంటోన్న నెటిజన్లు:
ఇకపోతే... సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుండే తమన్నాకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. నిత్యం తన సినిమాల సంగతులతో పాటు వ్యక్తిగత విషయాలను ఆమె అభిమానులతో పంచుకుంటూ వుంటారు. అలాగే హాట్ హాట్ ఫోటో షూట్‌లతో సెగలు రేపుతూ, వయసు పెరుగుతున్నా తన అందం ఏమాత్రం తగ్గడం లేదని నిరూపిస్తున్నారు తమన్నా. తాజా మిల్కీ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూడటానికి అది బ్రా లాగా వున్నా బ్రా కాదు.. పోనీ టాప్ అనుకున్నా టాప్ కూడా కాదు. బ్లూజీన్స్, వైట్ పాప్‌లో ఆమె ఎద అందాలు కనిపిస్తూ.. కుర్రకారుని గిలిగింతలు పెడుతోంది. తమన్నా హాట్ అందాలకు ఫిదా అయినా నెటిజన్లు ఆమె అందాన్ని వర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments