భక్త కన్నప్ప మళ్లీ తెరపైకి వచ్చింది..

  • IndiaGlitz, [Saturday,March 19 2016]

రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా బాపు తెర‌కెక్కించిన చిత్రం భ‌క్త క‌న్న‌ప్ప‌. ఈ చిత్రం కృష్ణంరాజుకు మంచి పేరు తీసుకువ‌చ్చింది. అందుచేత భ‌క్త క‌న్న‌ప్ప అంటే కృష్ణంరాజుకి మ‌క్కువ ఎక్కువ‌. అందుక‌నే భ‌క్త క‌న్న‌ప్ప చిత్రాన్ని కృష్ణంరాజు ప్ర‌భాష్ తో నేటి ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు తీయాల‌నుకున్నారు. ఇదిలా ఉంటే...మంచు విష్ణు హీరోగా మోహ‌న్ బాబు కూడా భ‌క్త‌క‌న్న‌ప్ప చిత్రాన్ని నిర్మించాల‌నుకున్నారు. ఈ చిత్రానికి త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.
అయితే ఆత‌ర్వాత ఏమైందో ఏమో..కానీ విష్ణు - త‌నికెళ్ల‌భ‌ర‌ణి కాంబినేష‌న్లో ప్లాన్ చేసిన భ‌క్తక‌న్న‌ప్ప ఆగిపోయిందంటూ వార్త‌లు వ‌చ్చాయి. దీంతో కృష్ణంరాజు ఎవ‌రు తీసినా తీయ‌కపోయినా నేను మాత్రం భ‌క్తక‌న్న‌ప్ప సినిమా తీస్తాన‌ని ప్ర‌క‌టించారు. తాజాగా ఈరోజు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న మోహ‌న్ బాబు విష్ణు తో భ‌క్త క‌న్న‌ప్ప సినిమా ప్లానింగ్ జ‌రుగుతుంది. ఈ చిత్రానికి ల‌క్ష్మీ ప్ర‌స‌న్న నిర్మాత అని చెప్పారు. దీంతో పోటీ లేద‌నుకున్న భ‌క్త కన్న‌ప్ప కి మ‌ళ్లీ పోటీ మొద‌లైంద‌ని చెప్ప‌వ‌చ్చు.మ‌రి...ప్ర‌భాస్...విష్ణు...ఇద్ద‌రిలో ఎవ‌రు ముందుగా భ‌క్త క‌న్న‌ప్ప‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తారో చూడాలి.