ఫిలిం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి తలసాని
- IndiaGlitz, [Wednesday,February 08 2017]
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (టీ.ఎఫ్.జె.ఎ) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్ పిలింఛాంబర్ లో జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ డైరీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా తొలి ప్రతిని సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు, మలి ప్రతిని టీ.ఎఫ్.జె.ఎ గౌరవ అధ్యక్షులు బి.ఏ రాజు, అధ్యక్షులు రామనారాయణ రాజు స్వీకరించారు.
అనంతరం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ '' సినిమా జర్నలిస్ట్ లేకపోతే సినిమా ప్రమోషన్ ఉండదు. అందులో వాళ్ల పాత్ర అత్యంత కీలకమైంది. ఈ విషయాన్ని ఇండస్ర్టీల్లో పెద్దలు కూడా గుర్తుపుట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సినిమా అనే కుటుంబంలో జర్నలిస్టులను కూడా పెద్దలు కలుపుకోవాలి. ప్రభుత్వం నుంచి ఫిలిం జర్నలిస్టులకు అందాల్సిన ప్రోత్సకాలు అందకపోవడం దురదృష్ట కరం. కానీ కొత్తగా ఏర్పాటైన కేసీఆర్ ప్రభుత్వం రాగానే జర్నలిస్టులకు 100 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టాం. కమిట్ మెంట్ తో మేమంతా పనిచేస్తున్నాం. ఇకపై మీ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటాం. హెల్త్, ఆక్రిడిటేషన్ కార్డులను ముందుగా కల్పిస్తాం. రాబోయే కాలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడు కచ్చితంగా అందరికీ ఇళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. కాకపోతే మీ జర్నలిస్టు అందరూ కూడా కలిసి పనిచేయాలి. వేరు వేరే ఆసోసియేషన్స్ ఉన్నాయి. మీరంతా కలిసి పూర్తి డీటైల్స్ ఇస్తే వాటిని పరిశీలించి అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. అలాగే మీ కుటుంబాలలో ఎవరైనా విడోస్, అంగవైకల్యం ఉన్న వారికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెన్షన్ అందరికీ ఇప్పిస్తాం. 'కల్యాణ లక్ష్మి' పథకంలో కూడా మీరంతా భాగస్వాములు కావాలి. ఆ ప్రోత్సహకాన్ని కూడా ఉపయోగించుకోవాలి. అలాగే మేజర్ ఆపరేషన్స్ కు సంబంధించి ఎమెర్జెన్సీ ఫండ్స్ ను కల్పిస్తాం. గతంలో చాలా ప్రభుత్వాలు ఇండస్ర్టీ నుంచి లబ్ది పోందాయి తప్ప, ఇండస్ర్టీకి చేసిందేమి లేదు. కానీ మా ప్రభుత్వం అలా కాదు. అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. అలాగే మీడియా కూడా చిన్న సినిమాలను ప్రోత్సహించాలి. చిన్న సినిమాలకు ఐదవ ఆట ఫెసిలిటీ కల్పిస్తాం. అలాగే షూటింగ్ లకు సంబంధించి సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తాం' అని అన్నారు.
టీ.ఎఫ్.జె.ఎ గౌరవ అధ్యక్షులు బి.ఏ రాజు మాట్లాడుతూ '' తలసాని కి గారికి సినిమాలపై మంచి అభిరుచి అవగాహాన ఉంది. ఇండస్ర్టీతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఆయన హాయాంలోనే పరిశ్రమ అభివృద్ది చెందుతుంది. అందకు మనం గర్వించాలి. అనాది కాలం నుంచి ఫిలిం జర్నలిస్ట్ లకు న్యాయం జరగడం లేదు. ఆయన పాత్రికేయులకు చాలా గౌరవం ఇస్తారు. ఒకసారి సెక్రటరియేట్ కి ఆయన్ను కలవాడినికి వెళ్లాను. వెయిట్ చేయమన్నారు. నా సూపర్ హిట్ మ్యాగజైన్ పంపిచగానే వెంటనే స్పందించి తన మీటింగ్ ఆపి దగ్గరకు పిలిపించి మాట్లాడారు. అప్పుడే ఆయన ఎలాంటి వారో అర్ధమైంది. ఆయన మన సమస్యలను వంద శాతం తీరుస్తారని నమ్మకం ఉంది. తలసాని గారి చేతుల మీదుగా మన డైరీ లాంచ్ కావడం సంతోషం గా ఉంది' అన్నారు.
టీ.ఎఫ్.జె.ఎ అధ్యక్షులు రామనారాయణరాజు మాట్లాడుతూ '' ఫిలిం జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా వచ్చే ఆక్రిడిటేషన్ వల్ల కొందరికి అన్యాయం జరుగుతుంది. అలాగే ఆర్ధిక పరంగా ఇబ్బందుల్లో ఎదుర్కుంటున్నారు. వాళ్లకు హెల్త్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సొంత ఇల్లు కల సాకారం చేయడానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా అందరికీ కేటాయించే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా ఫిలిం జర్నలిస్ట్ లకు కల్పించాలి. అలాగే కొంత మంది సినిమా జర్నలిస్ట్ లు వార పత్రికలను నడుపుతున్నారు. వాళ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు రావడం లేదు. దీంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వాళ్లను కూడా గుర్తించి ప్రభత్వం పరంగా అందాల్సిన ప్రోత్సకాలు అందాలని కోరుకుంటున్న. టీ.ఎఫ్.జె.ఎ తరుపున ప్రతీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. తక్షణం ఆ పనులను సాధించుకోవాలి. ఆ దిశగా అసోసియేషన్ లో ఓ ఉన్న సభ్యులందరూ సహకరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు
టీ.ఎఫ్.జె.ఎ.సలహారారులు సురేష్ కొండేటి మాట్లాడుతూ 'సాధారణంగా మంత్రులు వెంట మనం పడాల్సి ఉంటుంది. కానీ తలసారి వేరు. ఆయనే మన పని పూర్తయ్యే వరకూ మన వెంట పడతారు. అందుకే ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయా. తలసాని గారికి సినిమాలంటే చాలా ఫ్యాషన్. మనం చూడని సినిమాల గురించి ఆయన చెబుతుంటారు. ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత పనులన్నీ త్వరిగతిన జరుగుతున్నాయి. మా అసోసియేషన్స్ పనులన్నింటినీ నేనే చూస్తున్నా. కార్యవర్గం బాగా రన్ అవుతుంది. మా నుంచి సభ్యులకు అందాల్సిన ప్రోత్సకాలు సక్రమంగా అందుతున్నాయి. ఆ కార్యక్రమాలు చూసినప్పుడల్లా ఫిలిం జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని బాధిస్తుంది. హెల్త్ సమస్యలు వస్తే ఎటు వెళ్లలేని పరిస్థుల్లో ఉంటున్నారు. ముందుగా పిలిం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, తర్వాత ఆక్రిడిటేషన్, ఇళ్ల వసతి కల్పించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు మాట్లాడుతూ'' అసోసియేషన్స్ అంటే పేరుకే ఉంటున్నాయి. యాక్టివ్ లో ఉండటం లేదని కొత్త కార్యవర్గం సభ్యులను డిస్కరేజ్ చేసాను. కానీ కొత్త గా ఏర్పాటైనా టీ.ఎఫ్.జె.ఎ మూడు ప్రధాన అంశాలను ఎజెండగా పెట్టుకుని ముందుకు వెళ్తుంది. ఆక్రిడిటేషన్, ఇళ్లు, హెల్త్ కార్డులు తలసాని గారు అందరికీ ఇప్పించాలని కోరుకుంటున్నా. అలా జరిగిన రోజు ఆయనపై ఓ పుస్తకం రచిస్తా' అని అన్నారు.
వైస్ ప్రెసిడెంట్ ప్రసాదం రఘు మాట్లాడుతూ ' మంత్రి గారి చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరగడం ఆనందంగా ఉంది. ఆయన మనందరి సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం' అని అన్నారు.
తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోషియేషన్