సింగిల్ విండో అనుమ‌తులు..ఆన్ లైన్ టిక్కెట్ పోర్ట‌ల్ ను ప్రారంభించిన మంత్రి త‌ల‌సాని

  • IndiaGlitz, [Saturday,October 07 2017]

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత సినీప‌రిశ్ర‌మ భ‌విత‌వ్యంపై సినీప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు టి-ప్ర‌భుత్వంతో ముచ్చ‌టించిన సంగతి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌కు కొన్ని హామీలు ఇచ్చింది. అందులో ముఖ్యంగా సింగిల్ విండో ప‌ద్ధ‌తిలో షూటింగుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా సునాయాసంగా అనుమ‌తులు ల‌భించేలా చేస్తామ‌ని ప్ర‌భుత్వం ప్రామిస్ చేసింది.

తాజాగా ఆ ప్రామిస్‌ని నెర‌వేర్చింది టి-ప్ర‌భుత్వం. నేడు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ స్వ‌యంగా సింగిల్ విండో షూటింగ్ ప‌ర్మిష‌న్స్ వింగ్‌ను, ఆన్ లైన్ టిక్కెట్ పోర్ట‌ల్ ను ప్రారంభించారు. హైద‌రాబాద్‌ సెక్ర‌టేరియ‌ట్ లో నేటి ఉద‌యం 11 గంట‌ల‌కు డి-బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో కాన్ఫ‌రెన్స్ హాల్‌లో లాంచింగ్ కార్య‌క్ర‌మం చేశారు. ఇక నుంచి సునాయాసంగా ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా సింగిల్ విండో విధానంలో నిర్మాత‌లు షూటింగు అనుమ‌తులు పొంద‌వ‌చ్చ‌ని త‌ల‌సాని తెలిపారు. షూటింగ్ ల‌కు అనుమ‌తుల విష‌య‌మై టీ.ఎఫ్.డి.సికీ ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకుంటే 7 రోజుల్లో అనుమ‌తులు ల‌భిస్తాయ‌న్నారు.

ఒక‌వేళ అనుమ‌తి రాక‌పోతే అనుమ‌తి వ‌చ్చిన‌ట్లుగా ప‌రిగ‌ణంచి షూటింగ్ చేసుకోవ‌చ్చ‌ని త‌ల‌సాని తెలిపారు. అలాగే బ‌స్టాండ్ల‌లో మినీ థియేట‌ర్స్ నిర్మాణారికి టెండ‌ర్లు పిలిచామ‌ని, అంత‌ర్జాతీయ ఫిలిం స్టూడియో నిర్మాణానికి సంబంధిచి స్థ‌లం ఎంపిక‌పై దీపావ‌ళి త‌ర్వాత ప‌ర్య‌టిస్తామని, అలాగే ఐద‌వ ఆట‌కు సంబంధించి రెండు మూడు రోజుల్లో జీవో జారీ చేయ‌నున్నామ‌య‌ని త‌ల‌సాని తెలిపారు.

ఈ స‌మావేశంలో ప్ర‌భుత్వ స‌ల‌హ‌దారి కె.వి ర‌మ‌ణాచారి, ఎఫ్.డి.సీ చైర్మ‌న్ రామ్మోహ‌న‌రావు, ఎఫ్.డి.సి ఎండీ న‌వీన్ మిట్ట‌ల్, జె.ఎం.డి కిషోర్ బాబు, హైద‌రాబాద్ అడీష‌న‌ల్ క‌మీష‌న‌ర్ టి.ముర‌ళీ కృష్ణ‌, సైబ‌రాబాద్ జాయింట్ క‌మీష‌న‌ర్ షాన్ వాజ్ ఖాసీమ్, నిర్మాత‌లు దిల్ రాజు, జెమిని క‌ర‌ణ్ త‌దిత‌రులు పాల్గున్నారు.

More News

షకీలా చేతుల మీదుగా 'ద్యావుడా' ఆడియో విడుదల

శాన్వి క్రియేషన్స్ సమర్పించు అమృత సాయి ఆర్ట్స్ ఫిల్మ్ 'ద్యావుడా'. సాయిరామ్ దాసరి దర్శకత్వంలో భాను, శరత్, కారుణ్య, హరిణి, అనూష, జై  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత హరీష్ కుమార్ గజ్జల.

'అందమైన జీవితం' అక్టోబర్ 13 న విడుదల

మేఘవర్ష క్రియేషన్స్ పతాకంపై, మలయాళం లో సంచలన విజయం సాధించిన 'జొమోంటే సువిశేషంగాళ్' చిత్రాన్ని 'అందమైన జీవితం' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు అభిరుచి గల నిర్మాత పత్తిపాటి శ్రీనివాసరావు. సత్యన్ అంతిక్కాడ్ ఈ చిత్రానికి దర్శకుడు.  దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాని

అత‌ని పై నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ జారీ..

ఎవ‌రి మీద‌నో కాదండి..హీరో జై పై నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. వివ‌రాల్లోకెళ్తే..గ‌త నెల సెప్టెంబ‌ర్ 21న త‌ప్ప‌తాగిన జై మ‌ద్యం మ‌త్తులో ఆడయార్‌లో ఓ బ్రిడ్జ్‌ను త‌న కారుతో ఢీ కొట్టాడు. ట్రాఫిక్ పోలీసులు జై పై కేసు పెట్టారు.

'రాజా ది గ్రేట్‌' చిత్రంతో ఐదో హిట్ కొడుతున్నాం - దిల్ రాజు

హీరో క్యారెక్టరైజేషన్‌కు త‌న‌దైన బాడీ లాంగ్వేజ్‌,  డైలాగ్ డెలివ‌రీతో వేరియేష‌న్ చూపించే క‌థానాయ‌కుడు మాస్ మ‌హారాజా రవితేజ‌. ఈయ‌న క‌థ‌నాయ‌కుడుగా ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'రాజా ది గ్రేట్‌'. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టే

సంక్రాంతికి రాజ్‌తరుణ్‌ 'రాజుగాడు'

యువకథానాయకుడు రాజ్‌తరుణ్‌ ఇప్పుడు వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్‌ హీరోగా రాణిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏటీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై రాజ్‌తరుణ్‌ హీరోగా రూపొందిన 'ఈడోరకం-ఆడోరకం', 'కిట్టుఉన్నాడుజాగ్రత్త', 'అంధగాడు' సినిమాతో హ్యాట్రిక్‌ హీరోగా నిలిచారు.