సింగిల్ విండో అనుమతులు..ఆన్ లైన్ టిక్కెట్ పోర్టల్ ను ప్రారంభించిన మంత్రి తలసాని
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్ర విభజన తర్వాత సినీపరిశ్రమ భవితవ్యంపై సినీపరిశ్రమ ప్రముఖులు టి-ప్రభుత్వంతో ముచ్చటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ పెద్దలకు కొన్ని హామీలు ఇచ్చింది. అందులో ముఖ్యంగా సింగిల్ విండో పద్ధతిలో షూటింగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సునాయాసంగా అనుమతులు లభించేలా చేస్తామని ప్రభుత్వం ప్రామిస్ చేసింది.
తాజాగా ఆ ప్రామిస్‌ని నెరవేర్చింది టి-ప్రభుత్వం. నేడు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్వయంగా సింగిల్ విండో షూటింగ్ పర్మిషన్స్ వింగ్‌ను, ఆన్ లైన్ టిక్కెట్ పోర్టల్ ను ప్రారంభించారు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో నేటి ఉదయం 11 గంటలకు డి-బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్లో కాన్ఫరెన్స్ హాల్లో లాంచింగ్ కార్యక్రమం చేశారు. ఇక నుంచి సునాయాసంగా ఎలాంటి సమస్యలు లేకుండా సింగిల్ విండో విధానంలో నిర్మాతలు షూటింగు అనుమతులు పొందవచ్చని తలసాని తెలిపారు. షూటింగ్ లకు అనుమతుల విషయమై టీ.ఎఫ్.డి.సికీ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే 7 రోజుల్లో అనుమతులు లభిస్తాయన్నారు.
ఒకవేళ అనుమతి రాకపోతే అనుమతి వచ్చినట్లుగా పరిగణంచి షూటింగ్ చేసుకోవచ్చని తలసాని తెలిపారు. అలాగే బస్టాండ్లలో మినీ థియేటర్స్ నిర్మాణారికి టెండర్లు పిలిచామని, అంతర్జాతీయ ఫిలిం స్టూడియో నిర్మాణానికి సంబంధిచి స్థలం ఎంపికపై దీపావళి తర్వాత పర్యటిస్తామని, అలాగే ఐదవ ఆటకు సంబంధించి రెండు మూడు రోజుల్లో జీవో జారీ చేయనున్నామయని తలసాని తెలిపారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహదారి కె.వి రమణాచారి, ఎఫ్.డి.సీ చైర్మన్ రామ్మోహనరావు, ఎఫ్.డి.సి ఎండీ నవీన్ మిట్టల్, జె.ఎం.డి కిషోర్ బాబు, హైదరాబాద్ అడీషనల్ కమీషనర్ టి.మురళీ కృష్ణ, సైబరాబాద్ జాయింట్ కమీషనర్ షాన్ వాజ్ ఖాసీమ్, నిర్మాతలు దిల్ రాజు, జెమిని కరణ్ తదితరులు పాల్గున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com