'పంతం' సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేసిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యాక్షన్ స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.,రాధామోహన్ నిర్మిస్తోన్న చిత్రం `పంతం`. గోపీచంద్ 25వ చిత్రమిది. కె.చక్రవర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా జూలై 5న సినిమా విడుదలవుతుంది. మోహరీన్ హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ `రైట్ నౌ...` ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ...
తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ - ``గోపీచంద్‌గారు హీరోగా చక్రవర్తి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌గారు నిర్మిస్తోన్న చిత్రం `పంతం`. గోపీసుందర్‌గారు మంచి సంగీతం అందించారు. మంచి అనుభవం ఉన్న టీమ్ సినిమా కోసం వర్క్ చేశారు. యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. గోపీచంద్‌గారు టాలెంటెడ్ హీరో. తనకు ఈ సినిమా మరో హిట్ చిత్రంగా మంచి పేరు తేవాలి. ఈ మధ్య ఇండస్ట్రీ మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతుంది. చాలా హిట్ చిత్రాలు వస్తున్నాయి. జూలై 5న విడుదలవుతున్న ఈ చిత్రం డైరెక్టర్ చక్రవర్తికి మంచి పేరు.. నిర్మాత రాధామోహన్‌గారికి మంచి డబ్బులు తేవాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ - ``సినిమా రంగం చాలా గొప్ప రంగం. తలసాని శ్రీనివాస్‌గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న ఈ సినిమా రంగం ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ``మా బ్యానర్లో గోపీచంద్‌గారితో చేసిన తొలి సినిమా. చాలా ప్రెస్టీజియస్‌గా నిర్మించాం. గోపీసుందర్‌గారు సంగీతం అందించిన ఈ సినిమా పాటలను ఈ నెల 21న విడుదల చేస్తున్నాం. అలాగే నేడు తలసానిగారి చేతుల మీదుగా రెండో సాంగ్ విడుదల కావడం ఇంకా ఆనందాన్నిస్తుంది. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను జూలై 5న విడుదల చేస్తున్నాం`` అన్నారు.
గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో మెహరీన్ నాయిక. పృథ్విరాజ్, జయప్రకాష్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కళ: ఎ.ఎస్.ప్రకాష్, మాటలు: రమేశ్ రెడ్డి, స్క్రీన్‌ప్లే: కె.చక్రవర్తి, బాబీ (కె.ఎస్.రవీంద్ర), కో డైరక్టర్: బెల్లంకొండ సత్యం బాబు, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ, దర్శకత్వం: కె.చక్రవర్తి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments