'ఐతే 2.ఓ' ట్రైలర్‌ను విడుదల చేసిన మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇంద్రనీల్ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్, కర్తవ్య శర్మ, నీరజ్, మ ణాల్, మ దాంజలి కీలక పాత్రధారులుగా రాజ్ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఐతే 2.ఓ'. ఫర్మ్ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు. మార్చి 16న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా.. తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ - ''పెరిగిన టెక్నాలజీలో సైబర్ క్రైమ్‌ను ఎలా చేస్తున్నారనే విషయాలను గమనిస్తూనే ఉన్నాం. దీన్ని ఓ మెసేజ్ క్రింద చూపిస్తూ 'ఐతే 2.0'ను రూపొందించారు. కొత్త టీంతో ఏర్పడ్డ ఈ సినిమా యూనిట్‌కు నా అభినందనలు. మెసేజ్‌తో పాటు ఇప్పటి ట్రెండ్‌కు తగ్గ సినిమాలను ప్రేక్షకులు చక్కగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు.
దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ - ''ఈ సినిమాకు సంబంధించిన యు.ఎస్ హక్కులను ఫ్యాన్సీరేటుకు దక్కించుకున్నారు. ఆ ఆనందంలో ఉన్న సమయంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస యాదవ్‌గారి చేతులు మీదుగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ నెల 16న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది'' అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ - ''ట్రైలర్‌ను తలసానిగారు విడుదల చేయడం హ్యాపీ. ఆయనకు మా టీం తరపున థాంక్స్. టెక్నికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది'' అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: కౌశిక్ అభిమన్యు, ఎడిటింగ్: కార్తీక్ పల్లె, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్, మాటలు, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: అరుణ్ చిలువేరు. నిర్మాతలు : కె.విజయరామరాజు, డా.హేమంత్ వల్లపు రెడ్డి దర్శకత్వం: రాజ్ మాదిరాజ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments